Begin typing your search above and press return to search.
తెలుగు ప్రేక్షకుల ఒత్తిడితో దిగొచ్చిన అమెజాన్ ప్రైమ్
By: Tupaki Desk | 11 Dec 2020 3:34 PM GMTఅమెజాన్ ప్రైమ్ పై గత కొన్ని రోజులుగా తెలుగు ప్రేక్షకులు కొందరు సోషల్ మీడియాలో చిన్న పాటి యుద్దమే చేస్తున్నారు అనడంలో సందేహం లేదు. మీర్జాపూర్ వెబ్ సిరీస్ విషయం లో తెలుగు ప్రేక్షకులను అమెజాన్ ప్రైమ్ మోసం చేసింది అనేది తెలుగు ప్రేక్షకుల ఆరోపణ. మీర్జాపూర్ మొదటి సీజన్ ను తెలుగులో డబ్ చేశారు. తెలుగు ప్రేక్షకులకు ముఖ్యంగా యూత్ ఆడియన్స్ కు విపరీతంగా మీర్జాపూర్ కనెక్ట్ అయ్యింది. దాంతో సీజన్ 2 వస్తున్న సమయంలో తెలుగు ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూశారు.
తీరా మీర్జాపూర్ సీజన్ 2 స్ట్రీమింగ్ అయిన తర్వాత అమెజాన్ లోకి వెళ్లి తెలుగు లాంగ్వేజ్ ను సెలక్ట్ చేసుకునేందుకు ప్రయత్నించగా అసలు తెలుగు భాష లేదు. దాంతో సబ్ టైటిల్స్ తో అర్థం అయ్యి కాక హిందీలోనే వెబ్ సిరీస్ ను చూశారు. కొందరు మాత్రం అర్థం కాక వదిలేశారు. కొందరు మాత్రం తెలుగు డబ్బింగ్ కోసం పట్టుబట్టారు. నెటిజన్స్ చేస్తున్న విజ్ఞప్తికి మరియు ఒత్తిడికి అమెజాన్ ప్రైమ్ దిగివచ్చింది. ఎట్టకేలకు కాస్త ఆలస్యంగా అయినా మీర్జాపూర్ తెలుగు వర్షన్ ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీంతో ఒక్కసారిగా మీర్జాపూర్ తెలుగు ను ప్రేక్షకులు చూస్తున్నారు. మీర్జాపూర్ మొదటి సీజన్ మాదిరిగా రెండవ సీజన్ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.