Begin typing your search above and press return to search.

మూడు సార్లు పెళ్లి చేసుకోవాలనుకున్నా.. దేవుడు రక్షించాడు

By:  Tupaki Desk   |   2 July 2022 2:30 AM GMT
మూడు సార్లు పెళ్లి చేసుకోవాలనుకున్నా.. దేవుడు రక్షించాడు
X
మాజీ మిస్ యూనివర్శ్‌ సుస్మితా సేన్‌ ఈమద్య కాలంలో సినిమాల్లో నటించడం ద్వారా కాకుండా ప్రేమ వ్యవహారాలు.. ఇతర విషయాలతో మీడియాలో ఎక్కువగా ఉంటుంది.

హీరోయిన్ గా గతంలో ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించిన సుస్మితా సేన్ ఇప్పుడు వెబ్‌ సిరీస్‌ ఆర్య ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆర్య రెండు సీజన్‌ లతో మంచి పేరు దక్కించుకున్న సుస్మిత తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

వెబ్ సిరీస్ ద్వారా మళ్లీ నటనలో ఎంట్రీ ఇచ్చిన సుస్మిత సినిమాల్లో కూడా నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. త్వరలోనే ఒక బాలీవుడ్‌ సినిమాల్లో నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ సమయంలో సుస్మిత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన వ్యక్తిగత విషయాల గురించి ఆ ఇంటర్వ్యూలో తెలియజేసింది.

సుస్మిత మాట్లాడుతూ... నా జీవితంలో... నా సినీ కెరీర్‌ లో అదృష్టవశాత్తూ ఆసక్తికరమైన వ్యక్తులను కలిశాను. వారిలో కొందరు నా జీవితానికి క్లోజ్ గా అనిపించారు. కాని వారిని పెళ్లి చేసుకోవడానికి మాత్రం ఆసక్తి కలగలేదు. వారు చాలా డల్ గా అనిపించారు. నా వ్యక్తిగత జీవితానికి నా పిల్లలతో సంబంధం లేదు. నేను ఆ విషయంలో తీసుకునే నిర్ణయాలను ఎప్పుడు కూడా వారు తప్పుబట్టలేదు.

నా రిలేషన్స్ గురించి వారు ఎప్పుడు కూడా ఎలాంటి ప్రశ్నలు వేయలేదు. నా ఇద్దరు పిల్లలు కూడా నేను తీసుకున్న నిర్ణయాలను ఎప్పుడు కూడా సంకోచం లేకుండా వాటిని అంగీకరించారు. వారిద్దరు కూడా వారికి నాతో పాటు సమానమైన గౌరవం.. ప్రేమను అందించారు.

నేను నా జీవితంలో మూడు సార్లు పెళ్లి చేసుకోవాలని భావించాను. ఆ సమయంలో అవతలి వ్యక్తి గురించి నాకు సమయానికి తెలియడంతో పెళ్లి క్యాన్సిల్‌ అయ్యింది. అవతలి వారి గురించి నాకు ఒక స్పష్టత రావడంకు ఎక్కువ సమయం పట్టలేదు. ఆ విషయంలో దేవుడు నన్ను రక్షించాడు అంటూ సుస్మిత తన పెళ్లీలు మరియు బ్రేకప్స్ గురించి చెప్పుకొచ్చింది.