Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్: మిస్టర్ కెకెగా చియాన్

By:  Tupaki Desk   |   3 July 2019 4:24 AM GMT
ఫస్ట్ లుక్: మిస్టర్ కెకెగా చియాన్
X
అపరిచితుడు లాంటి సినిమాలతో తెలుగులోనూ అశేషమైన అభిమానులను సంపాదించుకున్న చియాన్ విక్రమ్ కొత్త సినిమా కడరం కొండెన్ విడుదలకు ముస్తాబవుతోంది. దీన్నే తెలుగులో మిస్టర్ కెకె గా అనువదించి రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా వదిలిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చేలా ఉంది. ట్రైలర్ ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఆన్ లైన్ లో లాంచ్ చేయబోతున్నారు. దీనికి రెండు విశేషాలు ఉన్నాయి.

ఒకటి ఈ ప్రాజెక్ట్ కు కమల్ హాసన్ నిర్మాతల్లో ఒకరు కావడం. రెండోది ఆయన చిన్న కుమార్తె అక్షర హాసన్ ఇందులో హీరోయిన్ గా నటించడం. గతంలోనూ అక్షర కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అక్కయ్య శృతి హాసన్ స్థాయిలో పేరు తెచ్చుకోలేకపోయింది. ఆ లోటు మిస్టర్ కెకె తీరుస్తుందన్న నమ్మకం కమల్ లో ఉంది

మిస్టర్ కెకెకు ఉన్న మరో విశిష్టత గిబ్రాన్ సంగీతం. సాహో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్న ఇతను దీనికి సైతం మైండ్ బ్లోయింగ్ స్కోర్ ఇచ్చి ఉంటాడనే అంచనాలు ఉన్నాయి. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న మిస్టర్ కెకె పాత్ర తీరుతెన్నుల గురించి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. కాకపోతే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ అనే క్లారిటీ అయితే ఉంది. నెరిసిపోయిన గెడ్డంతో డిఫరెంట్ గా కనిపిస్తున్న విక్రమ్ ఇందులో కూడా చాలా రిస్కులే చేశాడట. దీపావళికి విడుదల టార్గెట్ చేసిన మిస్టర్ కెకె అఫీషియల్ రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది