Begin typing your search above and press return to search.

మిష్టర్.. ఏందీ కన్ఫ్యూజన్ కామెడీ??

By:  Tupaki Desk   |   5 April 2017 10:47 AM GMT
మిష్టర్.. ఏందీ కన్ఫ్యూజన్ కామెడీ??
X
అసలు కొన్ని సినిమాల రిలీజ్ డేట్లను చాలాసార్లు మర్చడంతోనే జనాలకు ఆ సినిమాలపై చాలా అసహనం పెరిగిపోతుంది. అయితే పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు ఎన్నిసార్లు రిలీజ్ డేట్ మార్చినా ఆ ఎక్సయిట్మెంట్ అలాగే ఉంటుంది. అటు పెద్ద సినిమా కాదు.. ఇటు చిన్న సినిమా కాదు.. అందుకే మధ్యలో ''మిస్టర్'' వంటి బొమ్మల తేదీలు మారుతుంటే.. అసలు వీళ్లేం చేస్తున్నారు అంటూ ఆడియన్స్ జుట్టు పీక్కుంటారు.

ఏప్రియల్ 14న రిలీజ్ అంటూ ఓ నెల క్రితమే శ్రీను వైట్ల డైరక్షన్లో వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన 'మిస్టర్' సినిమా తేదీని ప్రకటించేశారు. అయితే సడన్ గా ఆ డేట్ ను 13కు మార్చారు. ఒకవేళ కాటమరాయుడు ఫ్లాప్ అయ్యింది కాబట్టి మార్చారా.. లేకపోతే ఇంకేదైనా విషయం ఉందో తెలియదు కాని.. ఏప్రియల్ 13న కన్ఫామ్ అంటూ డే-కౌంటింగ్ పోస్టర్లు కూడా వేశారు. కట్ చేస్తే ఇప్పుడు మాత్రం అబ్బే మేం మళ్ళీ ఏప్రియల్ 14కు వెళ్ళిపోయాం అంటున్నారు. అసలు ఒక్కరోజు తేడాలో నిజంగా ఏం ఒరుగుతుందంటారు?

ఒకవేళ ఇదేమైనా సంక్రాంతి సీజన్ అయితే.. దాదాపు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరికీ హాలిడే కాబట్టి.. ఒక్కరోజు ముందుకొచ్చినా వెనక్కెళ్ళినా కూడా పేట్ మారిపోయే ఛాన్సుంది. కాని ఇప్పుడు సమ్మర్ సీజన్లో ఓ రోజు అటూ ఇటూ రావడం వలన నష్టం ఏమన్నా ఉందంటారా. అయినా చెప్పిన డేటుకు మిష్టర్ టీమ్ ఎందుకు నిలబడలేకపోతోందో!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/