Begin typing your search above and press return to search.

క్రికెట్ కెప్టెన్ కు గ్లామర్ కష్టాలు

By:  Tupaki Desk   |   8 Sep 2017 5:30 PM GMT
క్రికెట్ కెప్టెన్ కు గ్లామర్ కష్టాలు
X
మన క్రికెట్ కెప్టెన్ ఎవరు అనగానే విరాట్ కోహ్లీ అని చిన్న పిల్లల నుంచి అందరూ టక్కుమని చెప్పేస్తారు. ఈ మధ్య మన మహిళా క్రికెట్ వెలిగిపోతుండడంతో.. ఉమెన్ క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ అనే సంగతి.. క్రీడా ప్రియులకు తెలుసు. కానీ మన జనాలు.. జెండర్ వేరియేషన్ ఎంతలా చూపిస్తారని చెప్పేందుకు ఈ ఉదంతం ఓ చక్కని ఉదాహరణ.

ఇవాల్టి రోజుల్లో మహిళల డ్రెసింగ్ తీరుపై చాలా రకాల వ్యాఖ్యానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో మిథాలీ రాజ్ తన సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ వివాదాస్పదం అయింది. గాళ్స్ టేకోవర్ అనే హ్యాష్ ట్యాగ్ తో.. కాసింత గ్లామర్ గా మిథాలీ రాజ్ ఫోటో ఈ పోస్ట్ లో ఉంటుంది. దీనికి నెట్ జనాలు తీవ్రంగా రియాక్ట్ అయిపోయారు. మిథాలీ నుంచి ఇలాంటి డ్రెసింగ్ అసలు ఊహించలేదని బోలెడంత వాపోయారు. మరికొందరు అయితే.. ఏకంగా ఆమెను నువ్వేమైనా పోర్న్ స్టార్ వా అని కూడా అడిగేశారు. మోరల్ పోలీసింగ్ ఏ తీరుగా చేసేస్తున్నారనే సంగతి మిథాలీ రాజ్ పోస్ట్ కు వచ్చిన కామెంట్స్ ను చూస్తే అర్ధమవుతుంది.

ఇలాంటి పోస్ట్ ను విరాట్ కోహ్లీ చేసినా.. వేరే అమ్మాయిలతో కలిసి ఫోటోల్లో కనిపించినా.. గ్లామర్ ప్రపంచంలో యాడ్స్ కోసం పోజులు ఇచ్చినా.. చివరకు స్టేడియంలోంచే తన లవర్ అనుష్క శర్మకు ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చిన సంగతి కూడా జనాలు అంతగా పట్టించుకోలేదు. పైగా అదో హీరోయిజం టైపులో భావించేశారు మనోళ్లు. కానీ మిథాలీ రాజ్ దగ్గరకు వచ్చేసరికి.. కాసింత గ్లామర్ డ్రెస్ లో కనిపిస్తే.. ఏకంగా పోర్న్ స్టార్ అనేయడం.. దారుణమే!