Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: కవరెక్కిన కెప్టెన్
By: Tupaki Desk | 8 Sep 2017 5:08 PM GMTఇప్పటివరకు కేవలం సినిమా వాళ్ళకూ.. అలాగే క్రికెట్ ఆడే మగాళ్ళకు మాత్రమే అలాంటి అవకాశాలు దక్కేవి. కాని తరాలు మారుతున్నాయి. పద్దతులూ మారుతున్నాయి. అందుకే ఇప్పుడు కేవలం అమ్మాయిల కోసమే మ్యాగజైన్లు వస్తున్నాయి. వాటిపైనా కూడా కేవలం అమ్మాయిల ముఖచిత్రాలనే అచ్చువేస్తున్నారు. అదిగో ఇప్పుడు JFW మ్యాగజైన్ వారు ఇదే ఫీట్ ను పదే పదే చేస్తున్నారు.
ఆ మధ్యన సైనా నెహ్వాల్.. ఆ తరువాత పివి సింధు ఫోటోలను కవర్ పేజీపై ప్రచురించిన జస్ట్ ఫర్ ఉమెన్ మ్యాగజైన్ వారు.. ఇప్పుడు హైదరాబాద్ కు చెందిన మిథాలి రాజ్ ను ఎక్కించేశారు. అసలు ఎప్పటినుండో చాలా ఫేం ఉన్నా కూడా.. ఉమెన్స్ క్రికెట్ ను అస్సలు మన దేశంలో జనాలు చూడకపోవడం కారణంగా ఈమెకు దక్కాల్సిన గౌరవం దక్కలేదనే చెప్పాలి. కాని ఈ ఏడాది భారత మహిళల క్రికెట్ టీమ్ వరల్డ్ కప్ ఫైనల్స్ కు వెళ్ళింది. దానితో వెంటనే మిథాలి రాజ్ ను అందరూ మెచ్చుకోవడం మొదలెట్టారు. ఇదిగో ఇలా కవర్ పేజీలు కూడా ఎక్కించేశారు.
ఏదేమైనా కూడా ఇలా ఒక మహిళా క్రికెట్ కెప్టెన్ హాటు హాటుగా ఒక కవర్ పేజీపై కనిపిస్తుంటే.. ఆ కిక్కే వేరబ్బా అంటున్నారు క్రికెట్ లవ్వర్స్. ముఖ్యంగా అమ్మాయిలైతే చాలా గర్వంగా ఫీలవుతున్నారు. అది సంగతి.