Begin typing your search above and press return to search.

ఉమెన్ క్రికెట్ అంద‌రికీ చేరాలి- మిథాలీరాజ్

By:  Tupaki Desk   |   3 July 2019 4:16 AM GMT
ఉమెన్ క్రికెట్ అంద‌రికీ చేరాలి- మిథాలీరాజ్
X
మ‌హిళా క్రికెట్ .. రైతు స‌మ‌స్య‌లు .. రెండిటినీ ఒకే వేదిక‌పైకి తెచ్చి `ఫాద‌ర్ - డాట‌ర్` సెంటిమెంటుతో తెర‌కెక్కించిన సినిమా `కౌశ‌ల్య కృష్ణ‌మూర్తి`. త‌మిళంలో `కాణ‌` పేరుతో రిలీజై విజ‌యం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని భీమ‌నేని శ్రీ‌నివాస‌రావు దర్శ‌క‌త్వంలో మెగా ప్రొడ్యూస‌ర్ కె.ఎస్.రామారావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక‌కు టీమిండియా లేడీ క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ ముఖ్య అతిధిగా ఎటెండ‌య్యారు.

ఈ వేడుక‌లో మిథాలీ రాజ్ మాట్లాడుతూ - ``నిర్మాత కె.ఎస్.రామారావు గారి ఫ్యాష‌న్ ఎంతో గొప్ప‌ది. నేను బెంగ‌ళూరులో ఉంటే న‌న్ను అక్క‌డికి వ‌చ్చి ప్ర‌త్యేకంగా క‌లిశారంటే సినిమా ప‌ట్ల ఆయ‌న క‌మిట్ మెంట్‌ - ప్యాష‌న్ ఏంటో అర్థ‌మైంది. టీజ‌ర్ చూశాను. చాలా బాగా నచ్చింది. రియాలిటీకి ద‌గ్గ‌ర‌గా హృద‌యాన్ని హ‌త్తుకునేలా ఉంది. ఈ సినిమా పెద్ద‌ స‌క్సెస‌వుతుంది. ఓ అమ్మాయి క‌ల‌ల్ని నెర‌వేర్చేందుకు త‌ల్లిదండ్రులు ప‌డే త‌ప‌న‌ను తెర‌పై చూపిస్తున్నారు. అటు త‌మిళ్- ఇటు తెలుగు నిర్మాత‌లకు ధ‌న్య‌వాదాలు. ఎందుకంటే ఉమెన్ క్రికెట్‌ ను ఓ మాధ్య‌మం ద్వారా చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. ఉమెన్ క్రికెట్ అనే ఆట‌ను అంద‌రూ ప్రోత్స‌హించాలని చెప్పే చిత్రమిది. మ‌రో వైపు రైతు క‌ష్టాల‌ను తెర‌పై చూపిస్తున్నారు. మా అమ్మ‌గారు త‌మిళ చిత్రం చూసి న‌చ్చింద‌ని అన్నారు. అందుకే నేను చూస్తాను. నా టీమ్ మేట్స్ కు చూడ‌మ‌ని చెబుతాను`` అన్నారు.

విజ‌య్‌ దేవ‌ర‌కొండ‌తో మా బ్యాన‌ర్‌ లో ఐశ్వ‌ర్యా రాజేశ్‌ ను హీరోయిన్‌ గా తీసుకోవాల‌నుకుని ఈ రీమేక్ ని నిర్మించామ‌ని కె.ఎస్.రామారావు తెలిపారు. ఆయ‌న మాట్లాడుతూ.. ఐశ్వ‌ర్య‌ అంత‌కుముందు త‌మిళంలో చేసిన చిత్రాల‌ను చూశాను. ఆ సినిమాలు జాతీయ స్థాయిలోనే కాదు.. ఇత‌ర దేశాల్లోనూ పేరొచ్చింది. దేవ‌ర‌కొండ సినిమాలోనూ ఐశ్వ‌ర్య‌ గొప్ప పాత్ర‌ను చేసింది. కణ టీజ‌ర్‌ ను త‌ను నాకు పంపింది. అది న‌చ్చి వెంట‌నే ఆమెకు ఫోన్ చేసి ఈ సినిమాను నేను తెలుగులో చేయాల‌నుకుంటున్నాను రైట్స్ కావాల‌ని అడ‌గ్గానే ఆమె వ్య‌క్తిగ‌తంగా నాకోసం ఆమె త‌మిళ నిర్మాత‌లను అభ్య‌ర్థించింది. ఆ త‌ర్వాత తెలుగులో రైట్స్ ద‌క్కించుకుని సినిమా చేశాం. సావిత్రి- శార‌ద‌ నుండి నేటిత‌రం స‌మంత వ‌ర‌కు నేను తెలుగులో గొప్ప న‌టీమ‌ణులను చూశాను. వారేవ‌రికీ తీసిపోని గొప్ప పెర్ఫామ‌ర్ ఐశ్వ‌ర్యా రాజేశ్‌. భీమినేని చెప్పిన దానికంటే బాగా తీశారు. 35 రోజులు భ‌యంక‌ర‌మైన వాతావ‌ర‌ణంలో సినిమాను చేశాం. అంద‌రూ క‌ష్ట‌ప‌డ్డారు. త‌మిళంలోలాగానే తెలుగులోనూ సినిమా పెద్ద హిట్ అవుతుంది.. అన్నారు.