Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరీ : ఓరి దేవుడా.. ఏం అందం బాబోయ్..!
By: Tupaki Desk | 31 Oct 2022 2:30 AM GMTషార్ట్ ఫిలింతో క్రేజ్ తెచ్చుకుని అక్కడ టాలెంట్ చూపించి సిల్వర్ స్క్రీన్ ఛాన్స్ అందుకున్న భామ మిథిలా పాల్కర్. సినిమాలు, వెబ్ సీరీస్ రెండిటిలో అమ్మడు సత్తా చాటుతుంది. ఇమ్రాన్ ఖాన్ కట్టి బట్టి సినిమాతో టాలెంట్ చూపిన ఈ అమ్మడు ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ వెబ్ సీరీస్ గర్ల్ ఇన్ ద సిటీలో కూడా ఛాన్స్ అందుకుంది. అందులో తన నటనతో ఆడియన్స్ ని అలరించింది మిథిలా పాల్కర్. ఆ తర్వాత కర్వాన్, చాప్ స్టిక్స్ సినిమాలతో పాటుగా అఫీషియల్ చుక్యాగిరి వెబ్ సీరీస్ చేసింది. కాజోల్ తో త్రిబంగ సినిమాలో అలరించిన మిథిలా పాల్కర్ రీసెంట్ గా యువ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన ఓరి దేవుడా సినిమాలో నటించి మెప్పించింది.
ఓరి దేవుడా సినిమాలో అను పాత్రలో తన అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది మిథిలా. సినిమా టీజర్ రిలీజ్ టైం లోనే చరణ్ ఆమె గురించి చాలా స్పెషల్ గా చెప్పాడు. ఆమె చేసిన వెబ్ సీరీస్ లకు ఉపాసన తను రెగ్యులర్ గా చూస్తామని ఆమె నటనకు ఇంప్రెస్ అయ్యామని అన్నారు రాం చరణ్. ఓరి దేవుడా సినిమాలో కూడా ఆమె తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. రీసెంట్ గా రిలీజైన ఓరి దేవుడా కమర్షియల్ గా కూడా బాగానే వర్క్ అవుట్ అయ్యింది. విశ్వక్ సేన్ ఖాతాలో ఈ మూవీ మరో హిట్టు సినిమా అయ్యింది. ఇక తెలుగులో తనకు వచ్చిన ఈ ఐడెంటిటీని మరింత పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది మిథిలా పాల్కర్.
ఈ క్రమంలో అమ్మడు తన లేటెస్ట్ ఫోటో షూట్స్ తో ఆడియన్స్ ని అలరిస్తుంది. గ్లామర్ షోతో కాదు తన యాక్టింగ్ టాలెంట్ తో ఆడియన్స్ ని మెప్పిస్తా అని అంటున్న మిథిలా లేటేస్ట్ గా తన ఫోటో షూట్ తో కూడా తన ఓర చూపులతోనే ఫాలోవర్స్ ని బుట్టలో పడేస్తుంది. అమ్మడు ఏం చేసినా సంథింగ్ స్పెషల్ ఉండాల్సిందే. అందుకే ఫోటో షూట్ లో కూడా తన యాక్టింగ్ టాలెంట్ చూపించేస్తుంది. లైట్ కలర్ గాగ్రాతో తన కురులను అలా వెనక్కి అనుకుంటూ మిథిలా పాల్కర్ యూత్ ఆడియన్స్ ని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. ఎలాంటి పాత్ర అయినా సరే ఛాలెంజింగ్ గా తీసుకుని చేయాలని అనుకుంటుంది మిథిలా. ఓరి దేవుడా చూసిన తర్వాత ఆమెకు టాలీవుడ్ నుంచి రెండు మూడు క్రేజీ ఆఫర్లు వచ్చినట్టు తెలుస్తుంది. సౌత్ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఈ టాలెంటెడ్ బ్యూటీకి వరుస అవకాశాలు అందుకుని తెలుగులో మరో స్టార్ హీరోయిన్ అవ్వాలని ఆశిద్దాం.