Begin typing your search above and press return to search.

క్లాసిక్ న‌టుడు తండ్రి క‌డ‌సారి చూపు చూడలేని ధైన్యం

By:  Tupaki Desk   |   23 April 2020 4:15 AM GMT
క్లాసిక్ న‌టుడు తండ్రి క‌డ‌సారి చూపు చూడలేని ధైన్యం
X
కొవిడ్-19 తో మృతి చెందితే కుటుంబ స‌భ్యులు క‌డ‌సారి చూసుకోలేని ప‌రిస్థితి. అంత్యక్రియుల‌కు సైతం బాడీని అప్ప‌గించ‌ని స‌న్నివేశం. కేవ‌లం లైవ్ లోనే చివ‌రి చూపు చూసుకునే దౌర్భ‌గ్య ప‌రిస్థితి ఆ కుటుంబాల‌ది. ఇలాంటి వ్యథ‌ కుటుంబాల‌కు రాకూడ‌ద‌ని మొక్కుతున్నా...ఆ మొర పైవాడికి వినిపించిన‌ట్లు లేదు. విదేశాల్లో చ‌నిపోయినా... స్వ‌దేశంలో ఊరుగాని చోట క‌న్నుమూసినా ఇదే ప‌రిస్థితి. కొవిడ్ -19 తో మృతి చెంద‌క‌పోయినా.. జ‌నాలంతా అదే భ్ర‌మ‌లో ఉండి ఇది క‌రోనా మ‌ర‌ణం అంటూ ఎవ‌రూ ద‌గ్గ‌రికి వెళ్ల‌డం లేదు. ఇటీవ‌లే బెంగుళూరులో అలాంటి ఘ‌ట‌న ఒక‌టి చోటు చేసేకుంది. కోట్లాది రూపాయల‌ ఆస్తులున్నా... కుటుంబ స‌భ్యులు.. బంధుమిత్రులున్నా ఎవ‌రూ ద‌గ్గ‌ర‌కు రాలేని ఘోర స‌న్నివేశం నెల‌కొంది.

చివ‌రికి తండ్రిని శ్మ‌శానవాటిక వ‌ర‌కూ క‌న్న కూతుర్లే పాడి మోసుకెళ్లి ఆ ఘ‌ట్టం పూర్తి చేసారు. దేశంలో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న అంద‌రినీ క‌లచి వేసింది. ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటోన్న ప‌రిస్థితులు చూస్తుంటే మంట క‌లిసిన మాన‌వ‌త క‌నిపిస్తోంది. తాజాగా ప్ర‌ముఖ న‌టుడు మిథున్ చ‌క్ర‌వ‌ర్తి తండ్రి బ‌సంత్ కుమార్ చ‌క్ర‌వ‌ర్తి(95) మంగ‌ళ‌వారం ముంబైలో క‌న్ను మూసారు. గ‌త కొన్నాళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో అనారోగ్యానికి గురి కావ‌డంతో మృతి చెందారు. అయితే ఆయ‌న కుమారుడు మిథున్ చ‌క్ర‌వ‌ర్తి బెంగుళూరులో చిక్కుకున్నారు.


లాక్ డౌన్ కార‌ణంగా ఎవ‌రూ ఇల్లు క‌ద‌ల‌డానికి వీల్లేని ప‌రిస్థితులు గురించి తెలిసిందే. ఆయ‌న‌ ముంబై వెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తున్నా ఇప్ప‌టివ‌ర‌కూ మిథున్ చేరుకోలేక‌పోయారు. దీంతో మిథును తండ్రి క‌డ‌సారి చూపున‌కు నోచుకుంటారా? లేదా? అన్న అనుమానాలు కూడా వ్య‌క్తం అవుతున్నాయి. దేశంలో రాష్ట్ర‌ ప్ర‌భుత్వాల క‌ఠినమైన నిర్ణ‌యాల‌తో ముందుకెళ్తున్నాయి. అంత్య‌క్రియుల‌కు సైతం 15 మందికి మించకుండా ఉండ‌కూడ‌ద‌ని హెచ్చ‌రించాయి. ఆ రూల్ బ్రేక్ చేసినా క‌ఠినమైన శిక్ష‌లు వేస్తామ‌ని హెచ్చ‌రించాయి. కాగా బ‌సంత్ కుమార్ మృతిపట్ల ప‌లువురు బాలీవుడ్ సినీ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా వేదిక‌గా సంతాపం ప్ర‌క‌టించారు.