Begin typing your search above and press return to search.

ఆగిపోయిన మిథున్ చక్రవర్తి కొడుకు పెళ్లి

By:  Tupaki Desk   |   9 July 2018 7:26 AM GMT
ఆగిపోయిన మిథున్ చక్రవర్తి కొడుకు పెళ్లి
X
బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్ వివాహం ఆగిపోయింది. జూలై 7 శనివారం మదలసా శర్మతో జరగాల్సి న పెళ్లి పోలీసుల రంగప్రవేశంతో నిలిచిపోయింది . ఓ యువతి ఫిర్యాదు మేరకు ఐదురోజుల క్రితమే మహాక్షయ్ మీద, అతడి తల్లి యోగితా బాలీ మీద చీటింగ్, రేప్ కేసు నమోదైన సంగతి తెలిసిందే.. ఈ కేసులో శనివారం ఇద్దరికీ ఢిల్లీ కోర్టు యాంటిసెపెటరీ బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ అనంతరం అదే రోజు పెళ్లి జరగాల్సి ఉండగా.. కేసు విచారణ కోసం పోలీసులు పెళ్లి వేదిక వద్దకు చేరుకోవడంతో మదలసా శర్మ కుటుంబ సభ్యులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో పెళ్లి ఆగిపోయింది.

*కేసు ఇదీ..

మిథున్ చక్రవర్తి కొడుకు మహాక్షయ్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని.. 2015 నుంచి తనతో శారీరక సంబంధం కొనసాగిస్తున్నాడని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడని ఆరోపించింది. తర్వాత తనకు ఇష్టం లేకున్నా ఏవో మందులు ఇచ్చి అబార్షన్ చేయించాడని పేర్కొంది. మహాక్షయ్ తల్లి, మిథున్ భార్య యోగితా బాలి కూడా ఇందుకు సహకరించిందని తెలిపింది. అందుకే వీరిద్దరిపై సదురు యువతి కేసు పెట్టింది.

కేసు నమోదైనప్పటికీ పెళ్లికి ఇరు కుటుంబాలు సిద్ధమయ్యాయి. ఈ మేరకు ఊటిలోని వరుడి కుటుంబానికి చెందిన లగ్జరీ హోటల్ లో ఏర్పాట్లు చేశారు. అయితే ఈ కేసులో నిందితులను విచారించేందుకు పోలీసులు హోటల్ కు చేరుకోవడంతో మదలసా శర్మ కుటుంబ సభ్యులు పెళ్లికూతురుతో సహా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు శుభాష్ శర్మ-నటి శీలా శర్మ కుమార్తె అయిన మదలసా శర్మ కూడా మహాక్షయ్ తో చాలా రోజులుగా డేటింగ్ లో ఉంది. ఇద్దరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావడంతో పెద్దలు పెళ్లికి ఒప్పుకున్నారు. అయితే పోలీసులు పెళ్లిమంటపం వద్దకు రావడంతో పరువు పోతుందని తెలిసి పెళ్లి క్యాన్సల్ చేసి మదలసా కుటుంబం అక్కడి నుంచి వెళ్లిపోయింది.