Begin typing your search above and press return to search.

మిత్ర శర్మ... టాలీవుడ్ లోనే ఈమె చాలా ప్రత్యేకం

By:  Tupaki Desk   |   23 May 2021 7:00 PM IST
మిత్ర శర్మ... టాలీవుడ్ లోనే ఈమె చాలా ప్రత్యేకం
X
టాలీవుడ్‌ లో ఎంతో మంది హీరోయిన్స్‌ ఉన్నారు. వారిలో ఎక్కువ శాతం మంది ముంబయి నుండి లేదా ఉత్తరాదిలోని ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారే. వారు ఆఫర్ల కోసం టాలీవుడ్‌ కు వచ్చి ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటారు. వారిలో కొందరు సక్సెస్ అయితే మరి కొందరు నిరాశతో వెను దిరుగుతారు. కాని మిత్ర శర్మ మాత్రం చాలా ప్రత్యేకంగా నిలిచింది. సినిమాలపై మక్కువతో తెలుగు సినిమా ల్లో నటించాలనే ఆసక్తితో హైదరాబాద్‌ లో అడుగు పెట్టింది. ముంబయి నుండి హైదరాబాద్‌ కు వచ్చిన ఆమె చాలా విషయాలు నేర్చుకుంది. అందులో మొదటిది తెలుగు మాట్లాడటం. ఉత్తరాది ముద్దుగుమ్మ అయినా కూడా తెలుగు చక్కగా మాట్లాడుతుంది.

మిత్ర శర్మ హీరోయిన్ గా ప్రయత్నాలు చేసిన సమయంలో చాలా చోట్ల నిరాశ మిగిలింది. దాంతో ఆఫర్లు అడగడం కంటే ఆఫర్లు ఇవ్వడం బెటర్‌ అనే ఉద్దేశ్యంతో తన వద్ద ఉన్న కొద్దిపాటి డబ్బును పెట్టుబడిగా పెట్టి బాయ్స్ అనే సినిమాను తీసింది. ఆ సినిమా కంటెంట్‌ ను చూపించేందుకు ట్రైలర్‌ ను వదిలింది. రాహుల్ తో ఒక పాట పాండించి విడుదల చేసింది. రూపాయి లేకుండా హైదరాబాద్ వచ్చిన మిత్ర శర్మ చాలా నమ్మకంతో సినిమాను నిర్మించింది. త్వరలో విడుదల కాబోతున్న బాయ్స్ లో ఆమె హీరోయిన్‌ గా కూడా నటించింది.

రేపు మిత్రశర్మ బర్త్ డే ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ సినిమా పై మక్కువతో నేను ఈ సినిమాను నిర్మించాను. నా వద్ద ఉన్న సేవింగ్స్ అన్ని కూడా ఖర్చు చేశాను. సినిమా పై చాలా నమ్మకంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది. రాహుల్‌ పాడిన హే రాజా పాటకు యూట్యూబ్‌ లో మిలియన్ ల వ్యూస్ వస్తున్న నేపథ్యంలో సినిమా తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకంను ఆమె వ్యక్తం చేస్తుంది. మొత్తానికి టాలీవుడ్‌ లో ఉన్న ఎంతో మంది హీరోయిన్స్ లో మిత్ర శర్మ చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆఫర్ల కోసం వెదుక్కోకుండా ఆమె ఆఫర్లు ఇచ్చేందుకు నిర్మాతగా మారింది. కొత్త హీరోయిన్స్ మాత్రమే కాదు సీనియర్ హీరోయిన్స్ కూడా నిర్మాతగా మారాలంటే భయపడతారు. అలాంటిది ఈమె నిర్మాతగా సినిమా చేసింది. మరి ఈమె ప్రయత్నం ఎంత వరకు సఫలం అవుతుందో చూడాలి.