Begin typing your search above and press return to search.
సిఎం కొడుకు సినిమా ఆడిందా ఊడిందా
By: Tupaki Desk | 29 Jan 2019 1:30 AM GMTకర్ణాటక సిఎం కుమార స్వామి కొడుకుగా జాగ్వార్ సినిమా ద్వారా మనకూ పరిచయమైన నిఖిల్ గౌడ గుర్తున్నాడా. విజయేంద్ర ప్రసాద్ కథను అందించిన ఆ మూవీలో జగపతి బాబు-రమ్యకృష్ణ లాంటి తెలుగు వాళ్ళతో పాటు దర్శకుడూ మనవాడే కావడంతో ప్రేక్షకులు ఓ లుక్ వేశారు కానీ విషయం లేక తుస్సుమన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కొంత గ్యాప్ తీసుకుని నిఖిల్ గౌడ రెండో సినిమాతో శుక్రవారం వచ్చాడు.
సీత రామ కళ్యాణ పేరుతో వచ్చిన ఈ మూవీ ఫక్తు మాస్ మసాలా యాక్షన్ ఎంటర్ టైనర్. తెలుగు సినిమాల్లో కొన్ని వేలసార్లు వచ్చిన కథను అటు ఇటు తిప్పి రొటీన్ ఫార్ములాతో లాగించిన తీరు అంతగా ప్రేక్షకుల మెప్పు పొందలేకపోతోంది. పైగా నిఖిల్ గౌడ యాక్టింగ్ విషయంలో ఇంకా బేసిక్ స్టేజిలో ఉండటంతో బిల్డప్ తో కవర్ చేసే ప్రయత్నం చేసారు. కుమార స్వామి స్వంత బ్యానర్ మీద భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఫైనల్ గా నిరాశపరిచే ఫలితాన్ని అందుకునే దిశగా సాగుతోంది. రెండు వైరి కుటుంబాలు చెరో ఫ్యామిలీకి చెందిన హీరో హీరోయిన్లు ఇద్దరి మధ్య మొదలయ్యే ప్రేమ కథ కట్ చేస్తే గ్రామంలో ఓ పెద్ద సమస్య. అది తీర్చాల్సిన బాధ్యత హీరో మీద. ఇలా రొటీన్ ఫార్ములాలో సాగిపోయింది.
శరత్ కుమార్-రవిశంకర్ లాంటి సీనియర్లు కొంతవరకు నిలబెట్టే ప్రయత్నం చేసారు. ఇంతోటి దానికి బాలీవుడ్ నుంచి మైనే ప్యార్ కియా ఫేమ్ భాగ్యశ్రీని అనిల్ కపూర్ తమ్ముడు సంజయ్ కపూర్ ని తీసుకొచ్చి సరైన రీతిలో వాడుకోలేక వృధా చేసుకున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం కూడా మోతగానే సాగింది. మసాలా బాగా ఎక్కువైన ఈ కళ్యాణం ఏదో ఓ వర్గం బిసి సెంటర్ల ఆడియన్స్ ని కొంత వరకు మెప్పించేలా ఉంది తప్ప నిఖిల్ గౌడకు ద్వీతీయ విఘ్నం తప్పలేదు