Begin typing your search above and press return to search.
పవన్ సినిమాను చెడగొట్టారు
By: Tupaki Desk | 1 Feb 2019 8:03 AM GMTఆరేళ్ళ క్రితం వచ్చిన పవన్ కళ్యాణ్ ఆల్ టైం బ్లాక్ బస్టర్ అత్తారింటికి దారేది సృష్టించిన సంచలనం ఇంకా అభిమానులకు మరిచిపోలేని జ్ఞాపకమే. త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ మాయాజాలం పైరసీకు గురైనా దాని ప్రభావం కొంచెం కూడా లేకుండా బయటపడి సెన్సేషన్ రేపింది. అప్పుడే దాని రీమేక్ పై ఇతర బాషల వాళ్ళు కన్నేసినా తీయడానికి మాత్రం టైం పట్టింది. ఇంతకు ముందే కన్నడలో ఈగ విలన్ కిచ్చ సుదీప్ హీరోగా రన్న పేరుతో రీమేక్ చేస్తే అక్కడా హిట్టు కొట్టింది. ఇవాళ తమిళ్ రీమేక్ గా సింబు హీరోగా రూపొందిన వంత రాజవాతాన్ వరువెన్ విడుదలైంది.
గత కొద్దిరోజులగా తన సత్తా చాటేలా హంగామా చేయమని శింబు ఇచ్చిన పిలుపుతో కొంత వివాదాల్లో కూడా నలిగిందీ సినిమా. ఇక దీని రిపోర్ట్స్ వచ్చేసాయి. ఇది పూర్తిగా శింబుని వన్ మ్యాన్ షోగా చూపించే ప్రయత్నంలో దర్శకుడు సుందర్ సి ఏ మాత్రం మార్పులు చేయకపోవడం అంతగా ఫలితాన్ని ఇవ్వలేదు. ఓవర్ హీరోయిజంతో మిగిలిన పాత్రల్ని సరైన తీరులో ప్రెజెంట్ చేయకపోవడం అవుట్ పుట్ మీద ఫలితాన్ని ఇచ్చింది. ముఖ్యంగా ఒరిజినల్ వెర్షన్ లో ప్రాణంగా నిలిచిన పాటల స్థాయిలో ఇందులో హిప్ హాప్ తమిజా స్వరాలు మేజిక్ చేయలేకపోయాయి. అంతా రణగొణ ధ్వనిలా అనిపిస్తుంది.
దానికి తోడు రమ్యకృష్ణ నాజర్ లాంటి ఆర్టిస్టులను కూడా అంతగా ఉపయోగించుకోక పోవడంతో పెద్దగా పండలేదు. తెలుగులో అలీ - బ్రహ్మానందం చేసిన కామెడీని ఇందులో యోగి బాబు లాంటి కమెడియన్స్ తో సుందర్ చేసిన స్కిట్స్ రివర్స్ కొట్టాయి. హీరొయిన్లలో మేఘా ఆకాష్ జస్ట్ ఓకే అనిపించగా సెకండ్ హీరొయిన్ గా క్యాథరిన్ త్రెస్సా - ప్రణీత పాత్రలో సోసోగానే ఉంది. ఆరేళ్ళ క్రితం సినిమా కాబట్టి యధాతధంగా తీయకుండా ఎంటర్ టైన్మెంట్ ని కొంత అప్ డేట్ చేసుంటే బాగుండేది కాని కేవలం శింబు ఫ్యాన్స్ కి తప్ప సాధారణ ప్రేక్షకులకు ఒక రొటీన్ మసాలా ఫ్యామిలీ డ్రామాగా మిగిలిపోయిన వంతా రాజవాతాన్ వరువెన్ క్లాసిక్ కు బ్యాడ్ ఎగ్జాంపుల్ గా నిలిచిపోయింది