Begin typing your search above and press return to search.

అమలా పతి అలా పలికాడు!!

By:  Tupaki Desk   |   3 March 2017 12:19 PM GMT
అమలా పతి అలా పలికాడు!!
X
హీరోయిన్ అమలాపా పాల్ భర్త.. కోలీవుడ్ దర్శకుడు ఏఎల్ విజయ్ ఇప్పుడు సడెన్ గా హాట్ టాపిక్ అయిపోయాడు. పెళ్లి గురించి కొత్త కబురు చెప్పడమే ఇందుకు కారణం. రీసెంట్ గా ఈయన తండ్రి ఏఎల్ అళగప్పన్ మీడియా ముందుకు వచ్చి మరీ.. తన కొడుకుకి త్వరలో పెళ్లి అంటూ.. వివరాలు మరికొన్ని రోజుల్లో చెబుతానంటూ చల్లగా చెప్పాడు.

అయితే.. ఇప్పుడు సడెన్ గా విజయ్ కూడా కొత్త కబుర్లు చెబుతున్నాడు. అసలు తనకి ఈ జన్మలో రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యమే లేదని.. అలాంటి అలోచనేదీ తాను చేయడం లేదన్నాడు ఈ డైరెక్టర్. ఇదంతా అమలాపాల్ ను ఇంకా ప్రేమిస్తుండడంతోనే అనే వాదన ఉంది కానీ.. అప్పట్లో విడాకుల సంగతి తండ్రి బయటపెట్టినపుడు.. చాన్నాళ్లు సైలెంట్ గా ఉండి అప్పుడు ఓ ఓపెన్ లెటర్ లో అమలాపాల్ పై చాలానే ఆరోపణలు చేశాడు ఈ దర్శకుడు.

అవన్నీ గుర్తు చేసుకుంటే.. ఇప్పుడు చేతిలో సినిమాలు లేకపోబట్టే.. వార్తల్లో నిత్యం నానేందుకు తండ్రీ కొడుకులు కలిసి ఆడుతున్న డ్రామాగా ఈ ఎపిసోడ్ ని అభివర్ణిస్తున్నారు మరికొంతమంది. మరి ఇందులో ఏది వాస్తవమో !

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/