Begin typing your search above and press return to search.

మోసపోయిన అధికార పార్టీ ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   10 Sep 2021 5:45 AM GMT
మోసపోయిన అధికార పార్టీ ఎమ్మెల్యే
X
ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యే దారుణంగా మోసపోయాడు. అంత పేరు, పరపతి, అధికార బలం ఉన్నా కూడా ఈ ఎమ్మెల్యే మోసపోవడం హాట్ టాపిక్ గా మారింది. చట్టాలు చేసే స్థాయిలో ఉన్న ఈ ఎమ్మెల్యే మోసపోవడం ఇప్పుడు సంచలనంగా మారింది.

విశాఖ జిల్లా అధికార వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు దారుణంగా మోసపోవడం సంచలనంగా మారింది. ఆయన విశాఖ సమీపంలోని కొమ్మాదిలో 12 ఎకరాల స్థలాన్ని ఈ మధ్య ఒక దళారి నుంచి కొన్నాడు. అది తన భూమే అనుకొని పాపం ఎమ్మెల్యే గారు దానికి జీపీయే రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాడు. ఆ తర్వాత ట్విస్ట్ నెలకొంది.

తీరా ఆరాతీస్తే ఆ స్థలం అమెరికాలో నివాసం ఉంటున్న ఎన్నారైది అని తేలింది. దాంతో ఆయన నా భూమిలో మరొకరు రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఏంటి అంటూ పోలీసులను ఆశ్రయించాడు. అప్పుడు సీన్ లోకి పోలీసులు దిగా ఆరాతీస్తే అసలు విషయం బయటపడింది.

ఈ భూమిని ఎవరో నకిలీ యజమానులుగా మారి బ్రోకర్లు ఎమ్మెల్యే కన్నబాబుకు అమ్మేశారని తేలింది. నకిలీ పత్రాలు సృష్టించి దారుణంగా మోసం చేశారని వెలుగుచూసింది. ఎమ్మెల్యేను బురిడీ కొట్టించి మోసం చేశారంటే వాళ్లు ఎంత పెద్ద మోసగాళ్లో అర్థం చేసుకోవచ్చు. ఇక సామాన్యులను ఇట్టే చీట్ చేయగలరని అర్థం చేసుకోవచ్చు.

విశాఖ ఏపీకి పరిపాలన రాజధాని కావడంతో అక్కడ భూములు బంగారమయ్యాయి. ఒక్క ఎకరం కోసం కోట్లు కుమ్మరిస్తున్నారు. స్మార్ట్ సిటీ స్తలాల కోసం ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, ఉద్యోగులు ఎంతైనా పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఎమ్మెల్యే మోసం పోవడంతో ఇది వైరల్ అయ్యి కేసుల దాకా వెళ్లింది. అదే సామాన్యుల సంగతి అయితే నిండా మునిగినట్టే.. ఇంతలా అక్రమాలు జరుగుతున్న రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలు ఇలా వ్యవహరించడం దారుణమని ప్రజలు ఆరోపిస్తున్నారు. విశాఖలో భూములు కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితులున్నాయి.