Begin typing your search above and press return to search.

కీరవాణి ఈ సినిమాకు కొట్టాడేంటబ్బా

By:  Tupaki Desk   |   16 Jan 2018 8:23 AM GMT
కీరవాణి ఈ సినిమాకు కొట్టాడేంటబ్బా
X
అంటే ఒక మ్యూజిక్ డైరక్టర్ అన్న తరువాత పలానా సినిమా చేయాలి.. పలానా సినిమా చేయకూడదు అనే నియమం ఏమీ ఉండదు. కాకపోతే కొంతమందికి ఒక రేంజ్ వచ్చిన తరువాత మాత్రం కొన్ని సినిమాలకు పనిచేస్తే భలే కామెడీగా ఉంటుంది. ముఖ్యంగా బాహుబలి సినిమాకు పనిచేసిన కంపోజర్ ఒక చిన్న అడల్డ్ సినిమాకు మ్యూజిక్ ఇస్తే ఎలా ఉంటుంది?

అదేదో ఎడల్డ్ ప్రేమ కావ్యానికి మ్యూజిక్ ఇచ్చినా పర్లేదుకాని.. ఇప్పుడు ఏకంగా దాదాపు బూతు సినిమాలా ఉన్న వర్మ పోర్న్ డాక్యుమెంటరీ గాడ్ సెక్స్ అండ్ర ట్రూత్ కి మ్యూజిక్ అందించాడు కీరవాణి. ఈ 'యుట్యూబ్' సినిమా ట్రైలర్లో కంపోజర్ ఎంఎం క్రీమ్ అనే పేరు కనిపించగానే అందరూ షాకయ్యారు. నిజానికి వర్మ అండ్ కీరవాణి కాంబినేషన్లో గతంలో క్షణక్షణం వంటి టెరిఫక్ మ్యూజిక్ విన్నాం మనం. కాని ఆ కాంబినేషన్లో ఒక అడల్డ్ సినిమా తాలూకు మ్యూజిక్ వింటామని ఎప్పుడూ అనుకోని ఉండం. ఇప్పుడు అదే జరిగింది.

అసలు శివ సినిమాకు కూడా కీరవాణి వర్మకు ఎన్నో ఇన్పుట్స్ ఇచ్చాడు. నిజానికి ఆ సినిమాకు ఇళయరాజాకంటే ముందు కీరవాణితోనే మ్యూజిక్ చేయించాలని వర్మ అనుకున్నాడులే. అటువంటి కీరవాణి ఇప్పుడు వర్మ అండ్ నాగ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాకు బాణీలు అందిస్తున్నాడు అనుకుంటే.. ఇలా ఈ పోర్న్ సినమా గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ తో షాకిచ్చాడు