Begin typing your search above and press return to search.
నేను గూగుల్ మ్యాప్ ఫాదర్ లా కాదుః కీరవాణి
By: Tupaki Desk | 22 March 2021 4:35 AM GMTటాలీవుడ్ లో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న దిగ్గజ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఇద్దరు కొడుకులు కూడా ఇప్పటికే ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఒకరు సంగీత దర్శకుడిగా పరిచయం అవ్వగా మరొకరు హీరోగా ఇప్పటికే ఎంట్రీ ఇచ్చారు. మత్తువదలరా సినిమా తో హీరోగా పరిచయం అయిన సింహా తాజాగా తెల్లవారితే గురువారం సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక తాజాగా జరిగింది. ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు అయిన ఈ వేడుకలో జక్కన మరియు కీరవాణి లు కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా కీరవాణి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కీరవాణి మాట్లాడుతూ.. ఇది మా అబ్బాయికి రెండవ సినిమా. ఎన్నవ సినిమా అయినా కూడా ప్రతి సినిమా ను కూడా ఒక స్టూడెంట్ లా నేర్చుకుంటూ చేయాలి. ప్రతి సినిమా సమయంలో తనను తాను మెరుగు పర్చుకుంటూ సినిమాల్లో స్టూడెంట్ లా నటించాలని చెప్పడం కోసం కాబోలు స్టూడెంట్ నెం.1 తారక్ ఇక్కడికి వచ్చాడు. చివరగా నేను చెప్పాలనుకుంటున్నది ఏంటీ అంటే ఫాదర్స్ రెండు రకాలుగా ఉంటారు. మొదటి రకం గూగుల్ మ్యాప్ ఫాదర్. బయటకు వెళ్లిన కొడుకును లెఫ్ట్ కు వెళ్లు రైట్ కు వెళ్లు యూటర్న్ తీసుకో అంటూ సలహాలు ఇస్తూ ఉంటారు. కాని నేను అలా కాదు బయటకు వెళ్లేప్పుడు ఆద్ ది బెస్ట్ కమ్ బ్యాక్ సేఫ్ అని మాత్రమే చెప్తాను అన్నాడు.