Begin typing your search above and press return to search.

27 ఏళ్ల త‌ర్వాత మాలీవుడ్ కి కీర‌వాణి!

By:  Tupaki Desk   |   30 May 2023 10:22 AM GMT
27 ఏళ్ల త‌ర్వాత మాలీవుడ్ కి కీర‌వాణి!
X
సంగీత ద‌ర్శ‌కుడిగా..గాయ‌కుడిగా ఎం.ఎం కీర‌వాణి సంచ‌నాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. తెలుగు.. త‌మిళం..మ‌ల‌యాళం..హిందీ అన్ని భాష‌ల్లోనూ సంగీతం అందించారు. అయితే తెలుగులో ఫేమ‌స్ అయినంత‌గా ఇత‌ర భాష‌ల్లో ప‌నిచేయ‌లేదు. 'బాహుబ‌లి'..'ఆర్ ఆర్ ఆర్' లాంటి సినిమాల‌తో పాన్ ఇండియాలో ఓ వెలుగు వెలిగారు. 'నాటు నాటు' పాట‌కు ఏకంగా ప్ర‌పంచ‌మే మెచ్చే ఆస్కార్ అవార్డు రావ‌డంతో! ఆయ‌న పేరు విశ్వ‌వ్యాప్త‌మైంది. ఆస్కార్ ఆయ‌న స్థాయిని మార్చింది.

ఈ నేప‌థ్యంలో తాజాగా కీర‌వాణి ఓ మ‌ల‌యాళ సినిమాకి సంగీతం అందించ‌డానికి డిసైడ్ అయ్యారు. 27 ఏళ్ల సుదీర్ఘ విరామం త‌ర్వాత మాలీవుడ్ కి వెళ్ల‌డం ఇదే తొలిసారి. ద‌ర్శ‌కుడు బేబిజాన్ వాల్య‌త్ స్వ‌యంగా నిర్మిస్తూ తెర‌కెక్కిస్తోన్న 'మెజీషియ‌న్' అనే సినిమాకి కీర‌వాణీ బాణీలు స‌మ‌కూర్చుతున్నారు. చివ‌రి సారిగా కీర‌వాణి 1996లో రిలీజ్ అయిన 'దేవ‌రాగం' అనే మ‌ల‌యాళ సినిమాకి సంగీతం అందించారు.

ఆ త‌ర్వాత మాలీవుడ్ లో అవ‌కాశాలు వ‌చ్చినా ప‌నిచేయ‌లేదు. సొంత భాష‌లోనే ప‌నిచేసారు. ఇటీవ‌ల తిరువ‌నంతపురంలో జ‌రిగిన ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల్లో సైతం పాల్గొన్నారు.

త‌న‌కిష్ట‌మైన సంగీత ద‌ర్శ‌కుడు బాబు రాజ్ సంగీతం స‌మ‌కూర్చిన కొన్నిమల‌యాళ పాట‌ల్ని కీర‌వాణి స్వ‌యంగా ఆల‌పించారు. ఆ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం ప‌ట్ల‌... చాలా గ్యాప్ త‌ర్వాత మ‌ల‌యాళ సినిమాకి సంగీతం అందించ‌డం ప‌ట్ల కీర‌వాణి సంతోషం వ్య‌క్తం చేసారు.

మొత్తానికి కీర‌వాణి ఓవైపు రిటైర్మెంట్ అంటూనే దూకుడు ఏమాత్రం త‌గ్గించ‌లేదు. బాహుబ‌లి త‌ర్వాత సంగీత ద‌ర్శ‌కత్వ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకుంటాన‌ని ప్ర‌క‌టించారు. కానీ ఆ త‌ర్వాత కొంత మంది ప్రోత్భ‌బ‌లంతో ప‌నిచేయాల్సి వ‌చ్చింది. అప్ప‌టి నుంచి మ‌ళ్లీ సంగీత ద‌ర్శ‌కుడిగా కొన‌సాగుతున్నారు. తాజాగా మాలీవుడ్ ఎంట్రీతో కీర‌వాణి మ‌రింత యాక్టివ్ అయిన‌ట్లు తెలుస్తుంది.

అలాగే ఎస్ ఎస్ ఎంబీ 29వ సినిమాకి ఆయ‌నే సంగీతం అందిస్తారు అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. రాజ‌మౌళి ఆ స్థానం సంగీత ద‌ర్శ‌కుడు కాబ‌ట్టి త‌ప్ప‌దు. ఇదే వేడిలో సౌత్ లో ఇత‌ర భాష‌ల్లోనూ కీర‌వాణి కంబ్యాక్ అయిన ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు.