Begin typing your search above and press return to search.
లేడీ మ్యూజిక్ డైరక్టర్ ఈజ్ బ్యాక్
By: Tupaki Desk | 13 Nov 2015 4:46 AM GMTపురుషాధిక్య ప్రపంచంలో అబలలైన ఆడవాళ్లకు చోటెక్కడ ఉంది? అని ప్రశ్నిస్తుంటారు. కానీ ఇలాంటి ఇండస్ర్టీలో ఎవరినీ లెక్కచేయకుండా కెరీర్ ప్రారంభించి సంచలనాలు - రికార్డులు సృష్టిస్తున్నవాళ్లెందరో. ఈ ఫీల్డులో కథానాయికలు రాణిస్తున్నారు. లేడీ డైరెక్టర్లు రాణిస్తున్నారు. లేడీ మ్యూజిక్ డైరెక్టర్లు మాత్రం ఉన్నది తక్కువే అయినా వాళ్లకు కూడా స్కోప్ ఉంది.
ముఖ్యంగా టాలీవుడ్ లో లేడీ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎం.ఎం.శ్రీలేఖ ప్రస్థానాన్ని గుర్తు చేసుకోవాల్సిందే. 12 ఏళ్ల వయసులో తాజ్ మహల్ సినిమాతో సంగీత దర్శకురాలిగా ఫీల్డులోకి అడుగుపెట్టింది. శ్రీకాంత్ హీరోగా డి.రామానాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇన్నేళ్ల కెరీర్ లో 75 పైగా సినిమాలకు సంగీతం అందించిన ట్రాక్ రికార్డ్ ఉంది. 3 వేలు పైగా పాటలు పాడిన గట్స్ తన సొంతం. ఇటీవలి కాలంలో ఆశించినంత వేగం లేకపోయినా ఇప్పటికీ తనకి అడపా దడపా ఆఫర్స్ ఉన్నాయి.
హైదరాబాద్ మణికొండలో తనకంటూ ఓ రికార్డింగ్ స్టూడియో కూడా ఉంది. ఇందులో రెగ్యులర్ గా ఎన్నో క్రియేషన్స్ చేస్తుంటారు శ్రీలేఖ. లేటెస్టుగా ఓ రెండు సినిమాలకు సంగీతం అందిస్తూ బిజీగా ఉన్నారు. వాటిలో స్టార్ రైటర్ - తనకి చిన్నాన్న అయిన విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైంటిఫిక్ థ్రిల్లర్ కి శ్రీలేఖ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా గురించి చెబుతూ ఇది రెగ్యులర్ ఫిలిం కాదు. లేడీ ఓరియెంటెడ్ సైంటిఫిక్ ఫిలిం. నా కెరీర్ కి కంబ్యాక్ మూవీ అవుతుందన్న నమ్మకం ఉంది.. అని అన్నారు. ఈ సినిమాతో పాటు మౌనం అనే చిత్రానికి పనిచేస్తున్నానని శ్రీలేఖ తెలిపారు.