Begin typing your search above and press return to search.

రాక్ స్టార్ ని లాక్ చేసిన మైత్రి

By:  Tupaki Desk   |   21 Jan 2019 10:08 AM GMT
రాక్ స్టార్ ని లాక్ చేసిన మైత్రి
X
మెగా కాంపౌండ్ లో ఇప్ప‌టికే 10 మంది హీరోలు ఉన్నారు. వీళ్లంద‌రికీ రాక్ స్టార్ దేవీశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించేశారు. ఇంట్రెస్టింగ్ గా ఆ సంగ‌తిని దేవీనే చెప్పాడు. త‌న ప‌నైపోయింద‌న్న వాళ్ల‌కు నేరుగా అత‌డే మెగా ఈవెంట్ లో స‌మాధానం ఇవ్వ‌డం ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కొచ్చింది. మెగా హీరోల్లో ఒక్క అల్లు శిరీష్ మిన‌హా అంద‌రు హీరోలకు నేను సంగీతం అందించాన‌ని దేవీశ్రీ‌ తెలిపాడు. మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంద‌రికీ సంగీతం అందించాను. మెగా మేన‌ల్లుడు సాయిధ‌రమ్ తేజ్ తో `తేజ్ ఐల‌వ్ యు` చిత్రానికి ప‌ని చేశాను. `చిత్ర‌ల‌హ‌రి`కి దేవీనే మ్యూజిక్ .. వైష్ణ‌వ్ తేజ్ వంటి న‌వ‌త‌రం ట్యాలెంటుకు సంగీతం అందించేస్తున్నా... అంటూ నాన‌క్ రామ్ గూడ ఓపెనింగ్ ఈవెంట్ లో దేవీ చెప్పాడు.

ఈ వేడుక‌లో దేవిశ్రీ మాట్లాడుతూ.. `` మెగా హీరోస్ అందరికి మ్యూజిక్ ఇచ్చాను. మైత్రి మూవీస్ నాకు హోమ్ బ్యానర్ లాంటిది. ఈ బ్యానర్ లో ఏ సినిమా వచ్చినా, నేను మ్యూజిక్ చేసినా చేయకపోయినా సినిమా గురించి నాతో డిస్కస్ చేస్తారు.. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ కూడా ఈ సినిమా లో భాగమవుతున్నందుకు ఆనందంగా ఉంది.. రెండు బ్యానర్స్ తో నాకు చాలా దగ్గర అనుబంధం ఉంది. బుచ్చిబాబు తో నాకు చాలారోజుల నుంచి పరిచయం ఉంది. సుకుమార్ తో ప‌ని చేస్తున్నప్పటినుంచి అయన తెలుసు.. ఎదుటి వ్యక్తి గురించి చాలా మంచి గా మాట్లాడే వ్యక్తుల్లో సుకుమార్ ఫస్ట్ ఉంటారు అని నా అభిప్రాయం.. సుకుమార్ ని ఓ కథతో ఒప్పించడమే బుచ్చిబాబు ఆస్కార్ కొట్టినంత !! ఈ సినిమా నేను చేయడానికి కారణం సుకుమార్ - బుచ్చిబాబు ద్వ‌యం. ఈ సినిమా కథ చెప్పినప్పుడు తప్పకుండా చేయాలనిపించింది. ఏ కథైనా విన్నప్పుడు డిఫరెంట్ కథ, కొత్త కథ అంటాం కానీ ఈ కథ అంతకుమించిన డిఫరెంట్ గా ఉంది. బిగినింగ్ నుంచి చాలా ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉన్నాయి.. తప్పకుండా ఈ సినిమా కు మంచి మ్యూజిక్ ఇస్తాను. చాలా థ్రిల్లింగ్ గా ఉంది`` అన్నారు.

మొత్తానికి దేవీశ్రీ ప్ర‌సాద్ మెగా కాంపౌండ్ తో అద్భుత‌మైన ర్యాపో మెయింటెయిన్ చేస్తూ కెరీర్ ప‌రంగా క్ష‌ణం తీరిక లేకుండా చూసుకుంటున్నాడు. కాంపిటీష‌న్ లో ఎంద‌రు న‌వ‌త‌రం సంగీత ద‌ర్శ‌కులు ఉన్నా దేవీకి ఉన్న డిమాండ్ ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. ఒకానొక ద‌శ‌లో దేవీశ్రీ ప‌ని అయిపోయింద‌న్న వాళ్లే అత‌డి రైజింగ్ స్టైల్ ని చూసి ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఖైదీనంబ‌ర్ 150 చిత్రానికి, రంగ‌స్థ‌లం చిత్రానికి అద్భుత‌మైన ఆల్బ‌మ్స్‌ ని అందించి పెద్ద హిట్ చేయ‌డంలో దేవీశ్రీ పాత్ర‌ను విస్మ‌రించ‌లేం. అందుకే మైత్రి సంస్థ దేవీశ్రీ‌ని ఆస్థాన విద్వాంసుడిగా లాక్ చేసింద‌న్న‌మాట‌.