Begin typing your search above and press return to search.

ద‌మ్ముంటే వాళ్ళకి ఛాన్సిచ్చి చూడు!

By:  Tupaki Desk   |   26 Sep 2016 3:27 PM GMT
ద‌మ్ముంటే వాళ్ళకి ఛాన్సిచ్చి చూడు!
X
వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచే మ‌హారాష్ట్ర న‌వ నిర్మాణ్ సేన పార్టీ మ‌రో కొత్త కాంట్ర‌వ‌ర్శీకి తెర‌తీసింది. ఉరీలో ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో పాకిస్థాన్ న‌టీన‌టుల‌కు ఇండియ‌న్ సినిమాల్లో అవ‌కాశం ఇవ్వ‌కూడ‌ద‌ని.. వాళ్లంద‌రూ ఇండియా వ‌దిలి వెళ్లిపోవాల‌ని ఆ పార్టీ ఇచ్చిన పిలుపును ఖండించిన క‌ర‌ణ్ జోహార్ పై ఎదురు దాడి చేసింది. పాకిస్థాన్ క‌ళాకారుల‌పై అప్ర‌క‌టిత‌ బ్యాన్ విధించ‌డం.. వారిని టార్గెట్ చేసుకోవ‌డాన్ని క‌ర‌ణ్ త‌ప్పుబ‌ట్టాడు. వారికి తాను మ‌ద్ద‌తుగా నిలుస్తాన‌ని అన్నాడు. దీనిపై ఎంఎన్ ఎస్ పార్టీ మండిప‌డింది. ద‌మ్ముంటే పాకిస్థాన్ న‌టీన‌టుల‌కు ఛాన్సిచ్చి చూడు అంటూ స‌వాలు విసిరింది.

ఉరీ దాడి నేపథ్యంలో పాకిస్థానీ నటీనటులు ముంబై వదిలి స్వదేశానికి వెళ్లిపోవాలంటూ తాము ఇచ్చిన గడువుపై చాలామంది స్పందించార‌ని.. ఇప్పటికే వాళ్లంద‌రూ ముంబై వదిలి వెళ్లిపోయారని.. నగరంలో ఇప్పుడు ఒక్క పాకిస్థాన్ కళాకారుడు కూడా లేరని ఎంఎన్ ఎస్ సీనియర్ నేత అమే ఖోప్కర్ తెలిపారు. తమకు ఎవరైనా కన‌బ‌డినా.. వాళ్లను బయటకు విసిరి పారేస్తామని హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం. క‌రణ్ జోహార్ కు దమ్ముంటే ఒక్క పాకిస్థానీ నటుడినైనా తన సినిమాల్లోకి తీసుకోవాలని.. అప్పుడు తామేం చేస్తామో చూడాలని అన్నారు. పాకిస్థాన్ నటీనటులు.. టెక్నీషియ‌న్లున్న ఏ సినిమానూ ఇండియాలో విడుద‌ల కానిచ్చేది లేద‌ని కూడా ఎంఎన్ఎస్ తేల్చి చెప్పింది.