Begin typing your search above and press return to search.

లవర్స్ మధ్య పోటీ పెడుతున్నారే

By:  Tupaki Desk   |   5 April 2017 5:46 AM GMT
లవర్స్ మధ్య పోటీ పెడుతున్నారే
X
ఇద్దరు స్టార్లు ప్రేమించుకుంటున్నారంటే.. వారితో కలిపి యాడ్స్ చేయించడం అనే కాన్సెప్ట్ చాలా సార్లే చూశాం. భార్యా భర్తలుగా మారిన జంటలతో కూడా కలిపి అండార్స్ మెంట్స్ చేసుకున్న కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు మారిన వాతావరణంలో.. కంపెనీలు కొత్త ట్రిక్కులు ప్రయోగిస్తున్నాయి. వారి మధ్యే పోటీ పెడుతూ నయా ట్రెండ్ ఆవిష్కరిస్తున్నాయి.

బాలీవుడ్ హాట్ లవర్స్ గా రణవీర్ సింగ్.. దీపికా పదుకొనేలను మొదటగా చెప్పుకోవాలి. వీరిద్దరి మధ్య విబేధాలు వచ్చాయనే టాక్ వినిపించింది కానీ.. అదంతా బిల్డప్ అనే విషయం ఈ మధ్యనే తేలిపోయింది. ఇప్పుడు మొబైల్ కంపెనీలు వీరిద్దరి ప్రేమను.. తమ పోటీకి ఉపయోగించేసుకుంటున్నాయి. వీవో బ్రాండ్ మొబైల్స్ కు రణవీర్ సింగ్ ప్రచారం చేస్తుండగా.. ఒప్పో ఫోన్లకు పబ్లిసిటీ చేస్తోంది దీపిక. తమ కంపెనీల ప్రచారం వీరి ప్రేమను పెట్టుబడిగా పెట్టేసి.. పోటా పోటీగా హోర్డింగ్స్ పెడుతున్నాయి ఈ రెండు కంపెనీలు.

జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే.. హైద్రాబాద్ పంజాగుట్టలో దీపికా- రణవీర్ ల హోర్డింగ్స్ ఎదురెదురుగా కనిపిస్తాయి. ఇదే ట్రెండ్ దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. దీపిక హోర్డింగ్ ఉన్న ప్రాంతంలో రణవీర్ మొబైల్ పట్టుకున్న పోస్టర్లు వేస్తుంటే.. ఈ యంగ్ స్టార్ పోస్టర్స్ అప్పటికే ఉన్న ప్రాంతాల్లో.. బ్యూటీ హోర్డింగ్స్ ను పెడుతున్నాయి కంపెనీలు. ఈ పోటా పోటీ ట్రెండ్ ను జనాలు మాత్రం బాగానే ఎంజాయ్ చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/