Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ సెట్లో సెల్ కనిపించకూడదు
By: Tupaki Desk | 24 July 2018 2:37 PM GMTఇప్పుడిప్పుడు సద్దుమణిగింది కానీ... ఆమధ్య టాలీవుడ్ లో లీకుల వ్యవహారం చాలా జోరుగా నడిచింది. ఎన్నిజాగ్రత్తలు తీసుకున్నా ఏదో రకంగా లీకులయ్యేవి. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే బాహుబలి సన్నివేశాలు కూడా బయటికొచ్చి కలకలం రేపాయి. మొన్నటికి మొన్న భరత్ అనే నేను లుక్ కూడా ముందే వచ్చింది. దర్శకుడు కొరటాల శివ ట్విట్టర్ ద్వారా లీకు వీరులకి విన్నపం చేయాల్సి వచ్చింది. ఆ వ్యవహారాన్ని మరిచిపోతున్న దశలోనే ఎన్టీఆర్ `అరవింద సమేత`లోని ఎన్టీఆర్ - నాగబాబు సీన్స్ బయటికొచ్చేయడంతో మరోసారి లీకు భాగోతం బట్టబయలైంది.
దాంతో ఒక్కసారిగా అరవింద సమేత బృందం అప్రమత్తమైంది. దర్శకుడు త్రివిక్రమ్ కి `అత్తారింటికి దారేది` సమయంలోనే ఆ అనుభవం ఎదురైంది. ఏకంగా ఆ సినిమా సగం వరకు బయటికొచ్చేసిన విషయం తెలిసిందే. ఆ తలనొప్పులు రిపీట్ కాకూడదనుకొన్న త్రివిక్రమ్ తన సెట్లో స్ట్రిక్ట్ రూల్స్ పెట్టేశాడు. అక్కడికి ఎవరూ సెల్ ఫోన్ తో రాకూడదు. పొరపాటున ఎవరిదగ్గరైనా సెల్ ఫోన్ కనిపిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారట. ఆ రూల్స్ మధ్యే మొత్తం సినిమా షూటింగ్ జరపాలని నిర్ణయించారు. లీకులు ఎక్కువ శాతం ఇంటి దొంగలు చేసేవే కాబట్టి ముందు సెట్లో జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టారు.