Begin typing your search above and press return to search.

దీప్-వీర్ పెళ్లిలో ఫోన్ల కు నో ఎంట్రీ

By:  Tupaki Desk   |   17 Aug 2018 5:11 AM GMT
దీప్-వీర్ పెళ్లిలో ఫోన్ల కు నో ఎంట్రీ
X
ఫోన్లు మన జీవితంలో ఎంతగా భాగం అయ్యాయంటే కాలకృత్యాలు తీర్చుకునే సమయంలో కూడా ఫోన్ ను కాసేపు పక్కనేబెట్టి అది కడుక్కోవాల్సి వస్తుంది. ఉదాహరణ ఛండాలంగా ఉన్నా అది నిజం. నిజం ఎప్పుడూ నిష్టూరంగా ఉంటుందని మన పెద్దోళ్ళేనాడో చెప్పారు కదా. మరిలా అలవాటైన ఫోన్లను పెళ్లి తీసుకురావద్దంటే ఎలా? అసలు పెళ్లి అంటే ఏంటి? అందరికీ అడ్డంగా నిలబడి పెళ్లికొడుకు-పెళ్లికూతురుల ఫోటోలు తీయడం. ఎక్కడో ఆఫ్రికా ఆన్ సైట్ లో ఉన్నోడికి స్కైప్ లోనో - వాట్సాప్ వీడియో కాలింగ్ లోనో ఈ పెళ్లి హంగామా లైవ్ లో కవరేజ్ ఇవ్వడం.. ఇదే కదా!

కానీ అలాంటివి దీప్ - వీర్ పెళ్లిలో కుదరవట. అంటే గెస్ట్ లకు అడ్డంగా పీసీ శ్రీరాం లాగా పోజిస్తూ నిలబడడాలు.. ఈఎస్పీపీఎన్ కెమేరామేన్ లా మ్యాచ్ లైవ్ కవరేజ్ ఇవ్వడాలు కాదు. అసలు ఫోన్లు తీసుకుని రావడమే కుదరదట. ఒక్క ముక్కలో చెప్తే ఫోన్ లు బ్యాన్. ఇంతకీ దీప్-వీర్ లు ఎవరని మీకు డౌట్ వచ్చిందా..? దాదాపు అందరికీ తెలుసుగానీ కొందరికి తెలియక పోవచ్చు కదా. దీపిక పదుకొనే- రణవీర్ సింగ్ లకు అభిమానులు జాయింట్ గా పెట్టు కున్న పేరు. ఇది కూడా 'బాలీవుడ్' 'టాలీవుడ్' లాగా అరువు తెచ్చుకున్న పేరే. బ్రాడ్ పిట్ - ఎంజలీనా జోలీ లను ముద్దుగా 'బ్రాంజెలీనా' అని పిలుచుకునే వారు. ఇప్పుడు వాళ్ళ పెళ్లి కూడా పెటాకులైంది. అది వేరే విషయం. బ్రాంజెలీనా లా మన దీపక - రణవీర్లను దీప్ - వీర్ అని పిలుచుకుంటున్నారు.

టాపిక్ ఎక్కడికో వెళ్లిపోయింది కదా. మళ్ళీ దీప్ - వీర్ దగ్గరకి వద్దాం. ఈ హిందీ ప్రేమపక్షుల పెళ్లి నవంబర్ 20 న ఇటలీ లో జరుగుతుంది అని బాలీవుడ్ మీడియాలో కథనాలు వండి వారుస్తున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్ అట. అసలే పెద్ద స్టార్లు కాబట్టి టాప్ లీగ్ గెస్ట్ లందరూ వస్తారు.. అయినా ఫోన్ లేకుండా ఎలా అబ్బా?