Begin typing your search above and press return to search.
మెగాస్టార్ పై ప్రశంసల వర్షం కురిపించిన మోదీ!
By: Tupaki Desk | 21 Nov 2022 11:30 AM GMTమెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' తరువాత నటిస్తున్న లేటెస్ట్ మాసీవ్ ఎంటర్ టైనర్ 'వాల్తేరు వీరయ్య'. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాని మైత్రీ మూవీ మేకర్స్ వారు అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. 'ఆచార్య' ఫ్లాప్, గాడ్ ఫాదర్ యావరేజ్ అనిపించుకోవడంతో మెగా ఫ్యాన్స్ ఆశలన్నీ 'వాల్తేరు వీరయ్య'పైనే వున్నాయి. ఈ మూవీతో చిరు తనదైన మార్కు హిట్ ని సొంతం చేసుకుని మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతారని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు.
ఈ నేఫథ్యంలో విడుదల చేసిన పార్టీ సాంగ్ ని భారీ స్థాయిలో ఫ్యాన్స్ వైరల్ చేశారు కూడా. చిరులో మళ్లీ 'ముఠామేస్త్రీ' నాటి జోష్ కనిపిస్తుండటంతో సెలబ్రేషన్స్ మోడ్ లోకి వెళ్లిపోయిన అభిమానులకు తాజాగా మరో గుడ్ న్యూస్ లభించింది. గోవాలో జరుగుతున్న 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలో మెగాస్టార్ చిరంజీవికి అరుదైన పురస్కారం లభించింది. ఇండియన్ ఫిల్మ్ పెర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ గా చిరుని ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
దీనిపై టాలీవుడ్ వర్గాలతో పాటు ఇండియన్ ఫిల్మ్ పెర్సనాలిటీస్ హర్షం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ స్పందిస్తూ అన్నయ్య కీర్తి కిరీటంలో మరో మణిహారం చేరిందని మురిసిపోతూ శుభాకాంక్షలు అందజేశారు.
భారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఈ అవార్డుని ఇప్పటి వరకు పలువురు స్టార్ లకు అందించిన విషయం తెలిసిందే. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, హేమా మాలిని, ఇళయరాజా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంటి తదితరులుకు ఈ పుస్కరాన్ని అందజేశారు.
ఇప్పడు ఈ ఏడాదికి గానూ ఈ పురస్కారానికి మెగాస్టార్ చిరంజీవిని ఎంపిక చేయడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మెగాస్టార్ చిరంజీవిపై ప్రశంసల వర్షం కురిపించారు. చిరంజీవి విలక్షణమైన నటుడు, అద్భుతమైన వ్యక్తిత్వంతో.., విభిన్నమైన నటనాచాతుర్యంతో అనేక పాత్రల్లో నటించి ఎన్నో తరాల ఆదరాభిమానాల్ని పొందుతున్నారు.
గోవాలో జరుగుతున్న భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో విశిష్టమైన ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ పురస్కారానికి ఎంపికైనందుకు ఆయనకు నా అభినందనలు' అంటూ ప్రశంసలు కురిపించారు. ఆదివారం గోవా పనాజీలో మొదలైన ఇఫీ వేడుకలు ఈ నెల 29 వరకు కొనసాగనున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.