Begin typing your search above and press return to search.
పవన్ హ్యాండ్ 'పవర్' అలాంటిది.. పట్టుకున్నాడు పద్మశ్రీ వరించింది
By: Tupaki Desk | 26 Jan 2022 4:17 AM GMTచుట్టూ సెలబ్రిటీలు బోలెడంత మంది ఉంటారు. అంతేనా.. టాలెంట్ ఉన్నోళ్లు కుప్పలుతెప్పలుగా ఉంటారు. కానీ.. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ తిరిగేటోళ్లు ఎంతో మంది. కానీ.. ఊపిరిసలపనంత బిజీగా ఉండే సెలబ్రిటీకి.. టాలెంట్ ఉండి.. పెద్దగా ఆదరణ లేని వారిని వెతికి పట్టుకునే లక్షణం చాలా తక్కువ. వారికి భిన్నంగా వ్యవహరిస్తుంటారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. తన సినిమాల్లో తనకెంతో ఇష్టమైన జానపదాన్ని.. అరుదుగా ఉండే ఆర్ట్ ఫాంలను వెతికి పట్టుకొని.. ప్రపంచానికి పరిచయం చేయటం ఆయనకెంతో ఇష్టం. అలా పరిచయం చేసిన ఒక మట్టిలో మాణిక్యం.. దగదగా మెరిసిపోతున్నాడు. పవన్ కల్యాణ్ హ్యాండ్ పడితే.. ఎంత ఫవర్ ఫుల్ గా ఉంటుందన్న విషయం.. తాజాగా ప్రకటించిన పద్మశ్రీ పురస్కారంతో అందరికి అర్థమైంది.
తన తాజా మూవీ భీమ్లా నాయక్ చిత్రానికి పాడేందుకు వచ్చిన కిన్నెర మొగిలయ్య.. వాస్తవానికి జనజీవనానికి ఏ మాత్రం పరిచయం లేని వారు. తనదైన పరిమిత ప్రపంచంల ఉండేవారు. అలాంటి ఆయన ఇప్పుడు సెలబ్రిటీగా మారారు. అదంతా పవన్ పుణ్యమేనని చెప్పాలి. మొన్నటి వరకు ఎవరికీ తెలీని ఆయన.. ఇప్పుడు అందరికి సుపరిచితుడే కాదు.. పవన్ ఆదరించటంతో ఆయన బతుకు మొత్తం మారిపోయింది.
భీమ్లా నాయక్ సినిమా కోసం పాటను పాడించిన పవన్ కల్యాణ్ పుణ్యమా అని.. మొగిలయ్య ప్రత్యేకత ఏమిటన్న కుతూహలం వ్యక్తమైంది. అంతే.. అప్పటివరకు ప్రతిభ ఉన్నా ఎవరికి పట్టని అతడు.. అందరి తలలో నాలుకలా మారారు. ఆయన టాలెంట్ ను చూసినోళ్లంతా ఔరా.. అనుకున్న వాళ్లే. మొగిలయ్యలో ఉన్న గాయకుడ్ని ప్రపంచానికి పరిచయం చేసిన పవన్.. అంతరించిపోతున్న కిన్నెర వాయిద్యం గురించి అందరికి తెలిసేలా చేశాడు.
కిన్నెర వాయిద్యాన్ని వాయిస్తూ పాటలు పాడే మొగిలయ్యకు ఒక గొప్ప కళను తాను ముందుతరాలకు అందిస్తున్న విషయం ఆయనకే తెలీదంటే నమ్మలేరు. కానీ.. అది నిజం. భీమ్లానాయక్ మూవీలో పాడటంతో మొదలైన గుర్తింపు.. అంతకంతకూ విస్తరిస్తూ పోతున్నారు. తాజాగా పద్మశ్రీ పురస్కారాల జాబితాలో మొగిలయ్య పేరు ఉండటం.. అతన్ని.. అతని ప్రయత్నాన్ని కేంద్రం గుర్తించినట్లైంది. ఇదంతా చూస్తే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. పవర్ ఫుల్ హ్యాండ్ మహిమనే చెప్పాలి.మొగిలయ్యకు వచ్చిన పద్మశ్రీ పురస్కారంలో క్రెడిట్ లో సింహభాగం పవన్ కల్యాణ్ దేనని చెప్పక తప్పదు.