Begin typing your search above and press return to search.

'ట్విట్టర్'లో కూడా కోహ్లీని వదలలేకున్న పాక్ సెలబ్రిటీ!

By:  Tupaki Desk   |   16 May 2020 10:11 AM GMT
ట్విట్టర్లో కూడా కోహ్లీని వదలలేకున్న పాక్ సెలబ్రిటీ!
X
కరోనా వ్యాప్తి కారణంగా అన్నీ దేశాల సెలబ్రిటీలతో పాటు సామాన్య జనం కూడా ఇంటి పట్టునే ఉంటున్నారు. ఇంట్లో ఉంటూ ఏం చేయాలో తోచక.. టీవీలు, ఫోన్ లకే పరిమితం అవుతున్నారు. ప్రస్తుతం అందరిలాగే ఇంట్లో ఉంటున్న పాకిస్థాన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ మహ్మద్‌ అమీర్‌.. తను చూస్తున్న టీవీ సీరీస్‌లో విరాట్ కోహ్లీ కనిపించాడని సోషల్ మీడియాలో పెద్ద దుమారమే లేపాడు. గతంలో బెస్ట్ బ్యాట్స్‌మెన్‌ కోహ్లీ.. ఈసారి ట్రోల్ చేసాడు. ఎప్పుడు చూసినా క్రికెట్ గ్రౌండ్ లో ప్రత్యర్థులుగా కనిపించే మొహమ్మద్ అమీర్, కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి వార్తల్లో నిలిచారు. కరోనా వైరస్ లాక్ డౌన్ వలన టీవీ చూస్తూ.. కుటుంబంతో సరదాగా కాలక్షేపం చేస్తున్నాడు అమిర్. అయితే 'ది రిలిస్ ఎర్టుగ్రుల్ ఘాజీ' అనే టీవీ సిరీస్ చూస్తున్నప్పుడు అందులో ఓ యాక్టర్ విరాట్ కోహ్లీ లాగా అమీర్ భావించాడట.

ఇక ఆలస్యం చేయకుండా అమీర్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో.. విరాట్ లాగా కనిపించే మరో వ్యక్తికి సంబంధించిన టీవీలోని ఫోటో పోస్ట్ చేసి.. ''కోహ్లీ'' ఇది మీరు కాదు కదా! నేను అయోమయంలో ఉన్నాను" అంటూ ట్వీట్ చేసాడు. వీరి మధ్య మాములు గానే పెద్ద యుద్ధం జరుగుతుంది. అలాంటిది ఇప్పుడు అమిర్ ట్విట్టర్ లో కూడా విరాట్ తో యుద్ధం మొదలు పెట్టాడని కోహ్లీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక కోహ్లీలా కనిపించిన ఆ యాక్టర్ కావిట్ సెటిన్ గోనర్. టర్కీష్‌కి చెందిన ‘దిరిలిస్ ఎర్టుగ్రుల్ ఘజ్’ సిరీస్‌లో ఆయన కనిపిస్తాడు. మరో వైపు ఇస్లామిక్‌ చరిత్ర, అందులోని విలువలను చూపించే ‘దిరిలిస్ ఎర్టుగ్రుల్ ఘజ్’ సిరీస్‌ని ప్రతీ ఒక్కరూ చూడాలని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఇదివరకే పాక్ యువతకు సూచించిన విషయం తెలిసిందే. ఇక 2016 ఆసియా కప్ లో, 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీకి.. అమిర్ అద్భుతమైన బౌలింగ్ యుద్ధం ఎల్లప్పుడూ ఫ్యాన్స్ లో ఆసక్తిరేపే విషయమే.