Begin typing your search above and press return to search.
నా బిడ్డ ఇచ్చిన హామీలన్ని నెరవేర్చుతాడు
By: Tupaki Desk | 11 Oct 2021 12:26 PM GMTమా ఎన్నికల్లో మంచు విష్ణు విజయంను సొంతం చేసుకున్నాడు. ఎన్నికల అధికారి ఓటింగ్ ఫలితాలను వెళ్లడించిన వెంటనే మోహన్ బాబు మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో ఆయన తన బిడ్డను గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశాడు. గెలిచిన విష్ణు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతాడనే నమ్మకంను మోహన్ బాబు వ్యక్తం చేశాడు. విష్ణు తరపున మోహన్ బాబు హామీ ఇచ్చినట్లుగా మా ఎన్నికల మ్యానిఫెస్టోను తప్పకుండా అమలు చేస్తాడని అంటున్నారు. మా ఎన్నికల్లో జరిగిన రచ్చపై మోహన్ బాబు స్పందిస్తూ ఇప్పటి వరకు జరిగిందేదో జరిగింది. ఇకపై అలాంటివి జరగకుండా చూసుకోవాలి. మా సభ్యులు ఎవరు కూడా ఈ విషయమై మా ప్రెసిడెంట్ అనుమతి లేకుండా మీడియాతో మాట్లాడవద్దు అంటూ మోహన్ బాబు సూచించాడు.
మీడియా ముందుకు ఎన్నికల గురించి మళ్లీ ఎవరైనా మాట్లాడకుండా మోహన్ బాబు చేసిన హెచ్చరిక అందరిని ఆకట్టుకుంది. భయంకరమైన వాగ్దానాలు చేశారు. వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత ఉందని అంటూనే తప్పకుండా విష్ణు అన్ని హామీలను నిలబెట్టుకుంటాడు అంటూ నమ్మకంగా మోహన్ బాబు చెప్పుకొచ్చాడు. అందరం ఒక తల్లి బిడ్డలం అన్నట్లుగా కలిసి మెలిసి ఉండాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి సంఘటనలు జరిగినా ఇప్పడు అందరం మా కుటుంబ సభ్యులం. కనుక ప్రతి ఒక్కరు కూడా విచక్షణతో వ్యవహరించాలని మోహన్ బాబు సూచించాడు. ఈ విషయంలో ఇంకా ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని మోహన్ బాబు సూచించాడు.
నాకు నటుడిగా జన్మనిచ్చిన దాసరి నారాయణ రావు గారు ఏలోకాన ఉన్నారో కాని ఆయన మా ఎన్నికలు ఏకగ్రీవం అవ్వాలని కోరుకున్నారు. వచ్చే సారి నుండి అయినా మా ఎన్నికలు ఏకగ్రీవం అయ్యేందుకు సినిమా పెద్దలు ప్రయత్నాలు చేయాలంటూ మోహన్ బాబు విజ్ఞప్తి చేశాడు. ఆడపడుచులు ఇతర మా సభ్యులు అందరు కూడా మా ప్రెసిడెంట్ అనుమతి లేకుండా మీడియా ముందుకు వెళ్ల కూడదు అంటూ మోహన్ బాబు విజ్ఞప్తి చేయడం జరిగింది. మా ఎన్నికల్లో ఇక ముందు ఈసారి జరిగిన పరిణామాలు జరుగకూడదు అంటూ కోరుకుంటున్నట్లుగా మోహన్ బాబు చెప్పుకొచ్చాడు. ఈసారి మా ఎన్నికల్లు పొలిటికల్ ఎన్నికలను తలపించేలా జరిగాయి అనడంలో సందేహం లేదు. రెండేళ్ల తర్వాత రాబోతున్న ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో చూడాలి.