Begin typing your search above and press return to search.
మోహన్ బాబు నోట గుండమ్మ కథ మాట
By: Tupaki Desk | 24 April 2016 6:25 AM GMTమోహన్ బాబుకు ఎందుకో ఉన్నట్లుండి ‘గుండమ్మ కథ’ మీదికి మనసు మళ్లింది. ఆ క్లాసిక్ ను తన పెద్ద కొడుకు మంచు విష్ణు.. యువ కథానాయకుడు రాజ్ తరుణ్ కాంబినేషన్లో రీమేక్ చేస్తే బాగుంటుందంటున్నాడాయన. విష్ణు-రాజ్ తరుణ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఈడోరకం ఆడోరకం’ హిట్ అయిన నేపథ్యంలో మోహన్ బాబుకి ఈ ఆలోచన వచ్చిందట. ఈ సినిమా సక్సెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ.. ‘‘విష్ణు.. రాజ్ తరుణ్.. చాలా బాగా నటించారు. వాళ్లిద్దరి జోడీ బాగుంది. ఈ సినిమాలో రెండో కథానాయకుడి పాత్రకు రాజ్ తరుణ్ పేరును విష్ణు చెబితే నేను ఏమాత్రం అభ్యంతరపెట్టలేదు. నాకిప్పుడు వీళ్లిద్దరి కాంబినేషన్లో గుండమ్మ కథ తీయాలనుంది. ఆ సినిమా హక్కులు ఉంటే కొంటాను. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలోనే ఆ సినిమా నిర్మిస్తాను’’ అన్నారు.
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన దాసరి నారాయణరావు మాట్లాడుతూ.. ‘‘హీరోల్ని కాకుండా కథల్ని నమ్మి సినిమాలు చేయాలి. ‘ఈడోరకం ఆడోరకం’ అలాంటి సినిమానే. విష్ణు సక్సెస్ చూసి మోహన్ బాబు ఎంత సంతోషిస్తాడో నేనూ అంతే సంతోషిస్తాను. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి. ఐతే సినిమాలు హిట్టవుతున్నాయని.. హీరోలు రేట్లు పెంచేసి నిర్మాతల్ని ఇబ్బంది పెట్టకూడదు. ఈ జనరేషన్ హీరోలను ఒక దగ్గరికి చేర్చి వాళ్లకు ఇలాంటి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. రాజేంద్ర ప్రసాద్ సెకండ్ ఇన్నింగ్స్ లో తాను లేకుండా తెలుగు సినిమాలే లేవేమో అన్నట్లు తనదైన శైలిలో పాత్రలు చేస్తున్నాడు. పోసానికి పర్సనల్ గా ఫోన్ చేసి మరీ చెప్పాను.. క్లైమాక్స్ సీన్లో అద్భుతంగా నటించాడని. రవిబాబు కూడా కామెడీ బాగా పండించాడు. అందరికీ అభినందనలు’’ అన్నారు.