Begin typing your search above and press return to search.
బ్రహ్మానందం.. ఆలీలతో శివాజీ రాజా గొడవేంటి?
By: Tupaki Desk | 25 March 2017 4:18 PM GMTసీనియర్ నటుడు శివాజీ రాజా లేటెస్ట్ యూట్యూబ్ ఇంటర్వ్యూ సంచలనం రేపుతోంది. ఈ ఇంటర్వ్యూలో ఆయన ఎన్నో వివాదాస్పద.. ఆసక్తికర విషయాలపై మాట్లాడాడు. నటుడు రంగనాథ్ పార్థివ దేహాన్ని మా కార్యాలయంలో పెట్టడంపై ప్రశ్నించిన ఓ సీనియర్ నటుడిని చెప్పు తీసుకుని కొడతానని హెచ్చరించినట్లు శివాజీ రాజా చెప్పడం ఇప్పటికే చర్చనీయాంశమైంది. ఇదే ఇంటర్వ్యూలో తనకు బ్రహ్మానందం.. ఆలీలతో తనకు తలెత్తిన విభేదాలపై శివాజీ రాజా మాట్లాడాడు.
ఒకానొక టైంలో తెలుగు పరిశ్రమలోని కొందరు నటులు కలిసి బ్రహ్మానందం పేరు మీద ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారట. అందులో నిధుల ఖర్చు విషయమై తేడా రావడంతో శివాజీ రాజా బ్రహ్మానందాన్ని నిలదీశాడట. దీనిపై పెద్ద వివాదం చెలరేగిందట. ఈ గొడవ మోహన్ బాబు.. పరిటాల రవిల వరకూ వెళ్లిందట. ఒక రోజు మోహన్ బాబు ఫోన్ చేసి తాను షూటింగ్ లో ఉన్న ప్రదేశానికి రమ్మన్నాడట. ఐతే అక్కడ పరిస్థితి చాలా సీరియస్ గా ఉందని.. అక్కడికి రావద్దని నటుడు శ్రీహరి ఫోన్ చేసి చెప్పినప్పటికీ శివాజీ రాజా వెళ్లాడట.
ఎందుకమ్మా గొడవలు.. కామ్ గా ఉండమని పరిటాల రవి చెప్పగా.. ఆ తర్వాత తన వద్దకు వచ్చిన మోహన్ బాబు టీ తాగమని చెప్పి గొడవ గురించి అడిగారని.. ఐతే సమస్య ఏం లేదని.. అంతా సర్దుకున్నామని చెప్పడంతో గుడ్ అని చెప్పి పంపేశారని శివాజీ రాజా వెల్లడించాడు. ఇక ఆలీతో గొడవ గురించి చెబుతూ.. మా ఎన్నికల్లో తన చేతిలో ఓడిపోవడాన్ని అతను జీర్ణించుకోలేకపోయాడని.. అప్పట్నుంచి తనను శత్రువులాగా చూస్తూ.. తనతో మాట్లాడ్డం మానేశాడని.. తానే ఆలీతో బలవంతంగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంటానని శివాజీ రాజా అన్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/