Begin typing your search above and press return to search.

మంచు విష్ణు .. మోహ‌న్ బాబు ఒకే మాట‌.. అది ఎవ‌రో చెప్ప‌రే

By:  Tupaki Desk   |   17 Feb 2022 4:30 PM
మంచు విష్ణు .. మోహ‌న్ బాబు ఒకే మాట‌.. అది ఎవ‌రో చెప్ప‌రే
X
టాలీవుడ్ లో క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు కున్న ప్ర‌త్యేక‌త వేరు. ఏ క్యారెక్ట‌ర్ చేసినా అందులో లీనమై పోయి అన‌ర్గ‌ళంగా డైలాగ్ లు చెప్ప‌డం ఆయ‌న‌కు మాత్ర‌మే సొంతం. పేజీల‌కు పేజీలు డైలాగ్ లు చెప్ప‌డంలో ఇప్ప‌టికీ ఇండ‌స్ట్రీలో మోహ‌న్ బాబుని మించిన వారు లేరంటే అది అతిశ‌యోక్తి కాదేమో. అంత‌లా ఆయ‌న న‌ట ప్ర‌స్థానంలో ప్ర‌త్యేక ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. న‌టుడిగా, విల‌క్ష‌ణ హీరోగా స‌రికొత్త ఇమేజ్ ని ఏర్ప‌ర‌చుకున్నారు.

కొంత విరామం త‌రువాత ఆయ‌న మ‌రోసారి హీరోగా న‌టించారు. ఆయ‌న న‌టించిన చిత్రం `స‌న్ ఆఫ్ ఇండియా`. స‌మ‌కాలీన రాజ‌కీయ అంశాల నేప‌థ్యంలో సెటైరిక‌ల్ మూవీగా రూపొందిన ఈ చిత్రం ఈ శుక్ర‌వారం ఈ నెల 18న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా గురువారం మోహ‌న్ బాబు చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారిన విష‌యం తెలిసిందే. నామీద ఇద్ద‌రు హీరోలు సోష‌ల్ మీడియా వేదిక‌గా దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని 50 నుంచి 100 మందిని పెట్టుకుని అదే ప‌నిగా ట్రోల్ చేయిస్తున్నార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

అయితే వారు ఎప్ప‌టికైనా శిక్షింప‌బ‌డ‌తార‌ని, వాళ్లెవ‌రో త‌న‌కు తెలుసున‌ని అన్నారు. కానీ వారి పేర్లు ఎందుకు చెప్ప‌డం లేదు. త‌న‌ని అదే ప‌నిగా ట్రోల్ చేయిస్తున్న వ్య‌క్త‌లు ఎవ‌రో తెలిసిన‌ప్పుడు వారి పేర్లు చెప్ప‌డానికి ఎందుకు మోహ‌న్ బాబు వెన‌కాడుతున్నారు? అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి. ఆ ఇద్ద‌రు హీరోలు ఎవ‌రో తెలిసిన‌ప్పుడు వాళ్లు పేర్లు బ‌య‌ట‌పెట్టొచ్చుక‌దా అంటున్నారు.

ఇక ఇదే త‌ర‌హాలో రెండు రోజుల క్రితం మంచు విష్ణు మాట్లాడిన విష‌యం తెలిసిందే. టిక్కెట్ రేట్ల పెరుగుద‌ల‌, భారీ చిత్రాల‌కు టిక్కెట్ రేట్ల పెంచుకునే వెసులుబాటు.. చిన్న చిత్రాల‌కు ఐద‌వ షో .. ఇలా ఇండ‌స్ట్రీ ఎదుర్కొంటున్న ప‌లు స‌మ‌స్య‌ల‌పై ఏపీ ముఖ్య‌మంత్రి సీఎం జ‌గ‌న్ తో మెగాస్టార్ చిరంజీవితో పాటు ప్ర‌భాస్ - మ‌హేష్ బాబు - రాజ‌మౌళి త‌దిత‌రులు ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. అయితే ఈ భేటీకి త‌న తండ్రి మోహ‌న్ బాబుకు ఆహ్వానం వున్నా అది ఆయ‌న‌కు చేర‌కుండా కొంత మంది అడ్డుప‌డ్డార‌ని, అలా అడ్డుప‌డిన వారు ఎవ‌రో త‌న‌కు తెలుసున‌ని మంచి విష్ణు ఇటీవ‌ల ఏపీ సీఎంతో ప్ర‌త్యేక భేటీ అనంత‌రం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే.

ఏపీ ప్ర‌భుత్వం చిరంజీవితో పాటు ప‌లువురికి ఫోన్ ల ద్వారా ప్రత్యేక భేటీకి ఆహ్వానం అందించిందట మ‌రి అలాంట‌ప్పుడు వేరే ఎవ‌రో అడ్డుత‌గిలార‌ని, త‌న తండ్రి మోహ‌న్ బాబుకు ఆహ్వానం అంద‌కుండా చేశార‌ని మంచు విష్ణు అన‌డం విడ్డూరంగా వుందని, అలా అడ్డుప‌డింది ఎవ‌రో .. వారి పేర్లేంటో చెప్పొచ్చుక‌దా? అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి. కీల‌క భేటికి అడ్డుగా నిలించింది ఎవ‌రో తెలుస‌ని చెబుతున్న మంచు విష్ణు వారి పేర్లెందుకు బ‌య‌ట‌పెట్ట‌డం లేద‌ని కొంత మంది ఇండ‌స్ట్రీ పెద్ద‌లు సెటైర్లు వేస్తున్నార‌ట‌.

మంచు విష్ణు త‌ర‌హాలోనే మోహ‌న్ బాబు కూడా త‌న‌పై ట్రోల్స్ చేయిస్తున్న ఇద్ద‌రు హీరోలు తెలుసు అంటున్నారే కానీ పేర్లు మాత్రం బ‌య‌ట పెట్ట‌క‌పోవ‌డం ఏంట‌ని, తండ్రీ కొడుకులు ఇలా ఎందుకు అంటున్నారో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేద‌ని ప‌లువురు ఇండ‌స్ట్రీ పెద్ద‌లు వాపోతున్నార‌ని తెలిసింది.