Begin typing your search above and press return to search.
టాలీవుడ్ పెద్దగా మోహన్ బాబు... ?
By: Tupaki Desk | 14 Oct 2021 4:30 PM GMTటాలీవుడ్ కి పెద్దలు అంటూ ఎవరూ లేరు అన్న మాట ఈ మధ్య గట్టిగా వినిపిస్తోంది. దర్శకరత్న దాసరి నారాయణరావు గతించాక టాలీవుడ్ అనాధ అయింది అన్న మాట కూడా తరచూ అనేక మంది ఆర్టిస్టులు అంటూ ఉంటారు. ఈ మధ్యనే ఒక టీవీ ఇంటర్వ్యూలో మంచు మోహన్ బాబు మాట్లాడుతూ దాసరితోనే పెద్ద రికం అంతా పోయింది అనేశారు.
తెలుగు సినీ పరిశ్రమలో పెద్దలు అంటూ ఎవరూ లేరు అని చెప్పేశారు. అయితే మా ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానల్ గెలిచాక మళ్లీ టాలీవుడ్ పెద్దల గురించి పెద్దరికాల గురించి రకరకాలుగా చర్చ అయితే సాగుతోంది. మా మాజీ ప్రెసిడెంట్ నరేష్ ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ దాసరి బాధ్యతలను మోహన్ బాబు స్వీకరించాలని కోరారు. మోహన్ బాబు అయితే పెద్దగా ఉంటే ఇండస్ట్రీ బాగుపడుతుంది అని కూడా అన్నారు.
దీనిని అదే వేదిక మీద ఉన్న మోహన్ బాబు సున్నితంగా తిరస్కరించినా కూడా ఆయన మదిలో కూడా అదే ఉంది అంటున్నారు. ముఖ్యంగా మా ఎన్నికల్లో కుమారుడు విష్ణు పోటీ చేసినా తెర వెనక ఉన్నది, వ్యూహాలు పన్నింది, చక్రం తిప్పింది మోహన్ బాబు అన్నదే అందరికీ తెలిసిందే. ఇక మోహన్ బాబు ఇంత వ్యయప్రయాసలకు ఓర్చి ఎందుకు ఇలా చేశారు అంటే దాని వెనక చాలా పెద్ద కధ ఉంది అంటున్నారు.
సినీ రంగ సమస్యల మీద ఇప్పటిదాకా పలువురు ప్రముఖులు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసిన సందర్భంలో ఎక్కడా మోహన్ బాబుని పిలవలేదు. అంతే కాదు, ఆయన గురించి కూడా తలవలేదు. సాధారణంగా ఒక పార్టీ సానుభూతిపరులు సినీ ఇండస్ట్రీలో ఉన్నపుడు వారి ప్రభుత్వం కనుక అధికారంలో ఉంటే వారినే తీసుకెళ్ళి సమస్యలు పరిష్కరించుకుంటారు. ఇది చాలా కాలంగా వస్తున్న ఆచారం.
అయితే వైసీపీ నేతగా మోహన్ బాబు ఉన్నా కూడా ఆయన్ని జగన్ తో మీటింగునకు ఎపుడూ సినీ ప్రముఖులు పిలవలేదు. అది ఆయన మనసులో ఉంది అంటారు. అంతే కాదు, జగన్ సర్కార్ వైపు నుంచి చూస్తే కూడా చిరంజీవి నాగార్జున వంటి వారినే పెద్దలుగా గుర్తిస్తున్నారు అన్న బాధ ఉంది. తాను సీనియర్ నటుడిగా ఉన్నా కూడా తనకు అటూ ఇటూ కూడా పెద్దగా గుర్తింపు లేకపోవడంతోనే ఆయన ఇపుడు మా ఎన్నికలను సవాల్ గా తీసుకున్నారని చెబుతారు.
మా ప్రెసిడెంట్ పదవి కనుక చేతుల్లో ఉంటే కచ్చితంగా సినీ పెద్దరికం తనకు దక్కుతుందని, ఆ మీదట ప్రభుత్వాలతో చర్చించడానికి భేటీలు వేయడానికి కూడా ఉపయోగపడుతుంది అన్న ఆలోచన కూడా ఉంది అంటున్నారు. ఇక వైసీపీ సర్కార్ అధికారంలోకి రావడానికి మోహన్ బాబు తన వంతుగా క్రుషి చేశారు. ఆయన ప్రచారం కూడా చేశారు.
ఇక ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా మోహన్ బాబుకు ఆశించిన పదవి ఏదీ దక్కలేదు. ఆయన రాజ్యసభ మెంబర్ షిప్ కోరుకున్నారు అన్న ప్రచారం అయితే ఉంది. అయితే వైసీపీ పెద్దల లెక్కలు సమీకరణలు వేరుగా ఉన్నాయి. దాంతోనే పదవి రాలేదు అంటారు. ఇపుడు సినీ పరిశ్రమ గురించి వైసీపీ సర్కార్ సీరియస్ గానే ఆలోచిస్తోంది. దాంతో కీలకమైన ఈ టైమ్ లో మా ప్రెసిడెంట్ పదవి తమ చేతుల్లో ఉంటే కచ్చితంగా జగన్ గుర్తిస్తారు అన్న ఆలోచన కూడా మంచు ఫ్యామిలీకి ఉందని ప్రచారం సాగుతోంది.
ఇలా వైసీపీ ప్రభుత్వం లో మంచి పదవిని కూడా కోరుకునేందుకు వీలు కలుగుతుంది అన్న వ్యూహంతోనే మా ఎన్నికల్లో ఢీ అంటే ఢీ కొట్టారని అంటున్నారు. మొత్తానికి మోహన్ బాబు మాస్టర్ ప్లాన్ ఫలించి విష్ణు ప్రెసిడెంట్ అయ్యారు. ఇక వైసీపీ సర్కార్ వైపు నుంచి కోరుకున్న సానుకూలత దక్కుతుందా అన్నది చూడాలి. అలాగే సినీ పెద్దగా కూడా తన హవా చాటాలనుకుంటున్న మోహన్ బాబు ఆశలు ఫలిస్తాయా లేదా అన్నది కూడా చూడాలి.