Begin typing your search above and press return to search.

ఒక్క‌రు కాదు... టీమ్ గా రాయండి రివ్యూ

By:  Tupaki Desk   |   10 Feb 2018 11:18 AM GMT
ఒక్క‌రు కాదు... టీమ్ గా రాయండి రివ్యూ
X
సినీ రివ్యూలు రాసే స‌మీక్ష‌కుల‌కు మెగా పంచ్ విసిరారు మోహ‌న్ బాబు. అస‌లే ఆయ‌న‌కు కోపం ఎక్కువ‌... అందులోనూ ఆయ‌న కోపాన్నిపెంచే విధంగా గాయ‌త్రి రివ్యూలు వ‌చ్చాయి. అలాగ‌ని పూర్తిన నెగిటివ్ రాక‌పోయినా... వారు రాసే విధానం క‌లెక్ష‌న్ కింగ్ కు కోపం తెప్పించింది.

కొంద‌రు క‌నీసం సినిమాను ఎంజాయ్ చేయ‌కుండా... ఒక ప‌క్క సినిమా చూస్తూ సీన్ సీన్ కి మ‌ధ్య రివ్వూ రాసేస్తూ ఉంటారు. ఆ రివ్యూని చూసి కొంద‌రు ప్రేక్ష‌కులు సినిమాకు వ‌స్తుంటారు... కొంద‌రు రారు... అయినా ఒక్క‌రు రాసిన స‌మీక్ష‌ను ఎలా న‌మ్ముతారు. మీరు సినిమా చూసి మీరే బావుందో లేదో తేల్చ‌వ‌చ్చుగా... అని మోహ‌న్ బాబు ప్రేక్ష‌కుల‌ను కోరారు. ఒక్క‌డు రాసే రివ్యూను ఎలా న‌మ్ముతార‌ని ప్ర‌శ్నించారు. ఇంట్లోనే కూర్చుని ల్యాప్ టాప్ రేటింగులు చూసి సినిమాకు రావాలా... వ‌ద్దా అని నిర్ణయించుకోవ‌ద్ద‌ని... ఆ రాసిన వ్య‌క్తి వేరొక హీరోకు ప్యాన్ కావ‌చ్చ‌ని... లేదా వేరే వాళ్ల చేతిలో కీలుబొమ్మ కావొచ్చ‌ని అన్నారు. అంతేకాదు సినీ విమ‌ర్శ‌కుల‌పై కూడా అంతెత్తున లేచారు మోహ‌న్ బాబు.

ఒక్క‌డే సినిమా చూసి అది బాగుందో లేదో చెప్పే రివ్యూల ప‌ద్ద‌తి మానేసి... పాతిక మంది క‌లిసి సినిమా చూడండి... ఆ పాతిక మంది ఒక ద‌గ్గ‌ర కూర్చుని వారి వారి అభిప్రాయాలు తీసుకుని... అప్పుడు రివ్యూ రాయ‌మ‌ని స‌ల‌హా ఇచ్చారు. ఒక్క‌డే కూర్చుని రాయ‌డం ప‌ద్ద‌తి కాద‌ని చుర‌క‌లంటించారు.

మోహ‌న్ బాబు లేటెస్టు సినిమా గాయ‌త్రి విడుద‌లై... మిశ్ర‌మ స్పంద‌న అందుకుంది. కొంత‌మంది బాగుంద‌ని రాస్తే, మ‌రికొంద‌రు అంత విషయం లేద‌ని రివ్యూలు రాశారు. ఇదే క‌లెక్ష‌న్ కింగ్ కోపానికి కార‌ణం కావ‌చ్చు.