Begin typing your search above and press return to search.

డైలాగ్‌ కింగ్‌ డాటర్‌ను పొగిడారా? తిట్టారా?

By:  Tupaki Desk   |   12 April 2015 11:30 AM GMT
డైలాగ్‌ కింగ్‌ డాటర్‌ను పొగిడారా? తిట్టారా?
X
''అబ్బాయిలు ఎలాంటి డ్రస్సులు వేస్తున్నా ఎవ్వరూ ఏమీ అనట్లేదు. కాని అమ్మాయిలు వేస్తే మాత్రం వారిని విమర్శిస్తున్నారు. అది నిజమే. కాని మన పిల్లలొచ్చి నానా నేను ఆ డ్రస్సే వేసుకుంటాను అంటే పేరెంట్స్‌గా మనం కాదనలేం'' అంటూ మొహన్‌ బాబు ఒక స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. నిన్న జరిగిన ''దొంగాట'' ఆడియో ఫంక్షన్‌లో ఈయన ఇచ్చిన కామెంట్లు చూసి ఇప్పుడు ఇండస్ట్రీ షాక్‌ అయిపోయింది.

ఎందుకంటే ఆయన మంచు లక్ష్మిని పొగిడారో తిట్టారో తెలియట్లేదు. మనకేంటి, మంచు లక్ష్మికి కూడా తెలియలేదు. అందుకే ఆమె స్టేజీ మీద ముఖం మాడ్చుకొని నుంచుంటే, నేను తప్పేం చెప్పాను ఐ యామ్‌ ప్రౌడ్‌ ఆఫ్‌ యువర్‌ ఎచీవ్‌మెంట్స్‌ అంటూ కవర్‌ చేశారు మోహన్‌ బాబు. ''నేను నా కూతురుని సింగర్‌ను చేద్దామని అనుకున్నా.. కాని అందరూ వద్దన్నారు. అలాగే చాలా అనుకున్నా. కాని అందరూ ఏమన్నారంటే.. నువ్వు ఇండస్ట్రీలో సంపాదిస్తున్నావ్‌ కదా, నీ కూతురు ఎందుకు ఇక్కడ? అనడిగారు. అందుకే బాగా చదువుకోమన్నా. కాని ఈమె మాత్రం చదువుకొని చివరకు యాక్టింగ్‌కే వచ్చింది. నువ్వు ఏదైనా చేయ్‌ పర్లేదు, కాని నీకు నీ భర్తకూ మాట రాకుండా చూసుకో'' అంటూ సెలవిచ్చారు. తనకు ఇష్టం లేకుండా యాక్టర్‌ అయ్యిందని మోహన్‌బాబు క్లాసు పీకినట్లు లేదూ?

ఇకపోతే మోహన్‌ బాబు గ్లామరస్‌ డ్రస్సింగ్‌ గురించి చెబుతూ సినిమాల్లో వ్యాపారాత్మక విలువ కోసం అలా చేయాల్సి వస్తోందంటూ చెప్పుకొచ్చారు. ఇక ఇదే ఈవెంట్‌ను మంచు లక్ష్మి ఒక బ్యాక్‌లెస్‌ గౌనులో వచ్చి పిచ్చెక్కించడం కొసమెరుపు. ఒకవేళ అందుకే మోహన్‌బాబుకు కోపమొచ్చిందా?