Begin typing your search above and press return to search.
దర్శకులు మోసం చేస్తున్నారు -మోహన్‌బాబు
By: Tupaki Desk | 23 May 2015 10:30 PM GMTలక్ష్మీ ప్రసన్న దొంగాట సినిమాతో సక్సెస్ కొట్టిన సందర్భంగా విజయోత్సవ వేడుకలో పలు ఆసక్తికర విషయాలపై మంచు మోహన్‌బాబు మాట్లాడారు. ఆ సంగులివి...
గ్యాస్ కబుర్లే ఎక్కువ...
డైరెక్టర్ ముందు స్క్రిప్టు చూసుకుని ఎంత తీయాలో అంతే తీయాలి. అప్పుడే నిర్మాత మిగిలినట్టు. తలకు మించిన భారంతో ఏదో ఒకటి అనుకుని, ఆ ఎడిటింగ్ టేబుల్ వద్ద కట్ చేసి, కోట్ల రూపాయలు పెట్టి, వేల కోట్లు వచ్చిందని చెప్పి, అంతా గ్యాస్ కబుర్లే ఎక్కువైపోయాయి. నిజమైన నిర్మాతలు చనిపోయారు. తక్కువ మంది ప్రతిభావంతులైన దర్శకులు ఉన్నారు. కాన్సన్‌ట్రేషన్ లేక, సబ్జెక్టు సరిగా తయారు చేసుకుని సెట్స్‌కెెళ్లకుండా... నిర్మాతల్ని మోసం చేస్తున్నారు దర్శకులు. నిర్మాత బతికి ఉన్నప్పుడు, చిన్న నిర్మాత బావున్నప్పుడు అంతా బావుంటుంది. ఫైనాన్సియర్ దగ్గర డబ్బు అప్పు తీసుకుని ల్యాబుల దగ్గర సినిమాలు ఆగిపోయి., ఎవ్వరికీ డబ్బు సరిగా ఇవ్వకుండా మోసం చేసేవాడు.. నిర్మాత కాదు. పెద్ద దొంగ. డబ్బులు ఇవ్వలేని పక్షంలో అందరి అనుమతి తీసుకుని సినిమా రిలీజ్ చేసినవాడు.. నిజమైన నిర్మాత. అది మేమే చేస్తున్నాం. ఇది సెల్ఫ్ డబ్బా కాదు. నా కూతురు కూడా ఇలానే చేస్తోంది. ఇతరుల్ని మోసం చేసి, ఫైనాన్సియర్లను మోసం చేసి సినిమాలు తీయకూడదు.
చప్పట్లు కొట్టిస్తా...
విలన్‌గా చేసినన్ని ఎక్స్‌ప్రెషన్స్ హీరోగా చేయలేం. ఇది నా ఓపెన్ చాలెంజ్ ఇప్పటికీ. ఒక విలన్‌గా ఎన్నిరకాల మాడ్యులేషన్స్‌లో డైలాగ్ చెప్పగలమో నాకు తెలుసు. ఓపెన్ చాలెంజ్... చాలెంజ్ అనే పదం అనగూడదు కానీ.. నేనెప్పుడూ నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకూ నాకు పోటీ లేదని అనుకుంటా ఒక విలన్‌గా. ఎక్కడ నొక్కి డైలాగ్ చెబితే ప్రజలు చప్పట్లు కొడతారో ఆ విధంగా చెప్పగలను.. ఒకే టైపు డైలాగులు ఉండవు. సినిమాలో ఒక డైలాగును ఒకే టైపు చెప్పకూడదు. అది పెద్ద బాలశిక్ష చదువకున్నట్టు ఉంటుంది.
ప్రతినాయకుడే గొప్ప...
విలన్ అంటే తక్కువ కాదు. ప్రతికథానాయకుడు అంటే విలన్ కాదు.. నిజజీవితంలో అలా ఉండం. రావణాసురుడు ప్రతికథానాయకుడు. ప్రతి కథానాయకుడికి ఓ ప్రతినాయకుడు ఉంటాడు. హీరో ఒక్కడినే సినిమా తీయమనండి.. పదిమంది నటీనటులు కలిసి నటిస్తేనే .. సినిమా. హాస్యం, శృంగార రసం అన్నీ ఉండాలి. చాలామంది నన్ను విలన్ అన్నారు. కానీ ప్రతి'నాయకుడిని' అని చూపించాను.
అది దాచడం ఎందుకు?
మందు కొట్టడాన్ని కూడా రహస్యంగా ఎందుకు? ఇంట్లోనే మందు కొడతా. దీన్ని దాచడం ఎందుకు? నిజజీవితంలో కూడా చేసేది ప్రతి ఒక్కరికీ తెలవాలనుకుంటాను. అందుకే ఓపెన్‌గా చెబుతున్నా.
సంతోషంగా ఉంది...
పెట్టిన డబ్బు వచ్చేస్తే మన సినిమా విజయం సాధించినట్టే. దొంగాటకు పెట్టుబడి వెనక్కి వచ్చింది.
బిడ్డను పొగడకూడదు. భగవంతుని ఆశీస్సులతో అందరి ప్రోత్సాహంతో దొంగాట సినిమా బాగా ఆడుతోంది. డైలాగులు చెప్పడంలోనూ లక్ష్మీ ప్రసన్న బాగా చెబుతుంది. దొంగాటలో మొదటి ఫైట్ చూడగానే ఎలా తీశావ్? ఈ ఫైట్ అని ఫైట్‌మాస్టర్‌ని, దర్శకుడిని అడిగాను. అదంతా వారి కృషి. ఈ విజయం సంతోషాన్నిచ్చింది.. అన్నారు.