Begin typing your search above and press return to search.
50 లక్షలకు 3 కోట్లిస్తున్నారు-మోహన్ బాబు
By: Tupaki Desk | 17 Sep 2016 5:27 AM GMTప్రస్తుతం తెలుగు పరిశ్రమలో నిర్మాతల పరిస్థితి దారుణంగా తయారైందని మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్లు పెరిగిపోవడానికి నిర్మాతలే కారణమని.. హీరోలు దర్శకుల వెంట పడి వారికి అయినకాడికి పారితోషకాలు ఆఫర్ చేయడం ద్వారా.. పరిశ్రమ నాశనానికి కారణమవుతున్నారని ఆయన విమర్శించారు. కలెక్షన్ల విషయంలో నిర్మాతలు వినిపించే లెక్కలన్నీ గ్యాసే అని ఆయన తేల్చేశారు.
‘‘ప్రస్తుతం పరిశ్రమలో నిర్మాతల పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా తయారైంది. ఇందుకు బాధ్యత కచ్చితంగా నిర్మాతదే. ఓ దర్శకుడు హిట్టు కొట్టగానే అతడి చుట్టూ తిరుగుతున్నారు. ఓ దర్శకుడు రూ.50 లక్షలకు అర్హుడైతే రూ.మూడు కోట్లు ఇస్తున్నారు. దీంతో ఆ దర్శకుడు రూ.10 కోట్లతో సినిమా తీయాల్సింది రూ.60 కోట్లు ఖర్చు పెట్టిస్తున్నాడు. ఈ డబ్బంతా ఎవరిది? నిర్మాతలు బినామీ పేర్ల మీద సినిమాలు తీస్తున్నారు. అందుకే పరిశ్రమలో డబ్బుకు విలువ లేకుండా పోయింది. మా సినిమాకు ఇన్ని కోట్లొచ్చాయి.. అన్ని కోట్లొచ్చాయి అని చెప్పుకునే లెక్కలన్నీ గ్యాసే. వాళ్లు చెబుతున్న అంకెలు వేరు. వాస్తవం వేరు’’ అని మోహన్ బాబు అన్నారు.
నిర్మాతగా తాను ఏనాడూ రాజీ పడలేదని.. ఎవ్వరికీ పైసా ఎగ్గొట్టకుండా పక్కాగా ఉంటున్నానని మోహన్ బాబు చెప్పారు. ఇంతే ఇస్తా.. ఇంతే ఇవ్వగలను అని ముందే చెబుతానని.. ఇస్తానన్నది పువ్వుల్లో పెట్టి ఇస్తానని అన్నారు. నిర్మాతగా విజయాలు వచ్చాయని.. పరాజయాలూ పలకరించాయని.. అవన్నీ దాటుకుని తన తరహాలో తాను వెళ్లిపోతున్నానని మోహన్ బాబు చెప్పారు.