Begin typing your search above and press return to search.
మోహన్ బాబే హీరో.. మోహన్ బాబే విలన్
By: Tupaki Desk | 16 Oct 2017 6:47 AM GMTతెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గ నటుల్లో మోహన్ బాబు ఒకరు. హీరో పాత్రయినా.. విలన్ క్యారెక్టరైనా ఆయన నటిస్తే దాని ప్రత్యేకతే వేరుగా ఉంటుంది. ఐతే 30 ఏళ్ల పాటు విరామం లేకుండా ఏకంగా 500 సినిమాలకు పైగా నటించిన ఈ లెజెండరీ నటుడు.. కొన్నేళ్లుగా వేగం తగ్గించేశాడు. అప్పుడప్పుడూ మాత్రమే ఓ సినిమా చేస్తున్నాడు. చివరగా ‘రౌడీ’ అనే సినిమాలో లీడ్ రోల్ చేశాడు మోహన్ బాబు. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ ఆయన కథానాయకుడిగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఆ సినిమానే.. గాయత్రి. ‘పెళ్లైన కొత్తలో’ ఫేమ్ మదన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే ‘మేడ మీద అబ్బాయి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నిఖిల ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది.
ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర కబురు బయటికి వచ్చింది. ఇందులో మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నాడట. అందులో ఒకటి హీరో పాత్ర అయితే.. ఇంకోటి విలన్ క్యారెక్టర్ అట. హీరోగా.. విలన్ గా గొప్ప గొప్ప పాత్రలు చేసిన మోహన్ బాబు.. ఒకే సినిమాలో ఇలా రెండు రకాల షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు చేయడం క్యూరియాసిటీ పెంచే విషయమే. ఇవి రెండూ నడి వయసు పాత్రలే అంటున్నారు. హీరోయిన్ నిఖిల ఇందులో మోహన్ బాబుకు కూతురిగా నటిస్తుందట. ఈ చిత్రాన్ని లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బేనర్ మీద మంచు ఫ్యామిలీనే నిర్మిస్తోంది. మోహన్ బాబు కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోయేలా ఈ సినిమాను తీర్చిదిద్దాలని మంచు ఫ్యామిలీ భావిస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుందట.