Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ కు 11న మోహన్ బాబు సమాధానం

By:  Tupaki Desk   |   2 Oct 2021 5:30 PM GMT
పవన్ కళ్యాణ్ కు 11న మోహన్ బాబు సమాధానం
X
ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ మధ్యలో సినీ ఇండస్ట్రీకి చెందిన మోహన్ బాబును లాగారు జనసేనాని పవన్ కళ్యాణ్. సినిమా టికెట్లు, ఇండస్ట్రీ సమస్యలపై తన బంధువైన జగన్ ను మోహన్ బాబు ఎందుకు మాట్లాడరని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఆ ప్రశ్నలకు జవాబిచ్చేందుకు ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు మోహన్ బాబు. ఈ మేరకు పవన్ కౌంటర్ కు ఎన్ కౌంటర్ చేసేందుకు 11వ తేదీని ఎంచుకున్నారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు అక్టోబర్ 10న ముగుస్తాయి. ఆ తర్వాత 11న నాన్నగారు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ కు సమాధానం ఇస్తారని.. ఈ మేరకు రెడీ గా ఉన్నారని.. గట్టిగా ప్రీపేర్ అవుతున్నారని హీరో మంచు విష్ణు తాజాగా తెలిపాడు..

'పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలన్నింటికి నాన్న మోహన్ బాబు సమాధానం చెబుతారు. 11వ తేదీన ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఒకవేళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు విడుదల ఆలస్యం అయితే 12వ తేదీన ప్రెస్ మీట్ పెడుతారు.  మీడియా సమావేశం మాత్రం పక్కా.. దీనికి సంబంధించి ఇప్పటికే నాన్న గారు ప్రీపేర్ అవుతున్నారు. కొంత సమాచారం తెప్పించుకున్నారు. పక్కా ఆధారాలతో ఆయన మీడియా ముందుకొస్తారు' అని హీరో మంచు విష్ణు సంచలన ప్రకటన చేశారు.

పవన్ కు సమాధానం ఏకంగా మోహన్ బాబు ప్రీపేర్ అవుతున్నారని మంచు విష్ణు అనడం చర్చనీయాంశమైంది.  దీంతో మోహన్ బాబు ఏం చెబుతాడు? ఎలా కౌంటర్ ఇస్తాడు? అన్నది ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే పోసాని కృష్ణమురళి రాజేసిన నిప్పు చల్లారడం లేదు.ఇప్పుడు మోహన్ బాబు కూడా తోడైతే దబిడ దిబిడే అంటున్నారు. మరి ఏం జరుగుతుందనేది 11వ తేదీన తేలుతుంది. అప్పటివరకు ఉత్కంఠగా ఎదురుచూడాల్సిందే.