Begin typing your search above and press return to search.
మెగాస్టార్ పై తన అభిప్రాయం చెప్పిన మోహన్ బాబు!
By: Tupaki Desk | 4 Nov 2021 5:30 PM GMT'ఆహా' ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో సరికొత్త కాన్సెప్ట్ తో 'అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీకే' కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ టాక్ షో నుంచి తొలి ఎపిసోడ్ దీపావళి సందర్భంగా డిజిటల్ ఆడియన్స్ ను పలకరించింది. తొలి ఎపిసోడ్ ను మోహన్ బాబుతో చేశారు. ఆయనతో పాటు మంచు లక్ష్మీ .. విష్ణు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఈ షో ద్వారా మోహన్ బాబు తన మనసులోని అనేక భావాలను పంచుకున్నారు. తన ఆనందాన్ని .. ఆవేదనను ఈ షో ద్వారా వ్యక్తం చేశారు. బాలకృష్ణ వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పడమే కాదు, తాను కూడా కొన్ని ప్రశ్నలను సంధించారు.
అలా ఇద్దరి మధ్య కాస్త సరదాగా .. కాస్త ఎమోషనల్ గా .. మరికాస్త గంభీరంగా ఈ కార్యక్రమం నడిచింది. బాలకృష్ణ అడిగిన ఒక ప్రశ్నకి సమాధానంగా మోహన్ బాబు మాట్లాడుతూ "నిర్మాతగా నేను అన్నగారితో ఒక సినిమా చేయాలనుకున్నాను. ఆ మాటను ఆయనతో చెబితే .. తన రాజకీయ జీవితాన్ని గురించి ప్రస్తావిస్తూ .. " ఇప్పుడు నా సినిమాలు ఎవరు చూస్తారు?'' అన్నారు. ఆ మాట నాకెంతగానో బాధను కలిగించింది.
నా బ్యానర్ లో వరుస సినిమాలు చేయాలనుకున్నాను .. చేశాను. వరుసగా కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దాంతో అప్పులు తీర్చడానికి నా భూములు అమ్ముకోవలసి వచ్చింది. అల్లుడు గారు .. అసెంబ్లీ రౌడీ .. బ్రహ్మ .. పెదరాయుడు సినిమాలు నిర్మాతగా నన్ను నిలబెట్టాయి" అన్నారు. "చిరంజీవిపై మీ అభిప్రాయం ఏమిటి?" అని బాలకృష్ణ వేసిన ప్రశ్నకి మోహన్ బాబు కాసేపు ఆలోచించారు. ఆ తరువాత మాట్లాడుతూ .. "చిరంజీవిపై నాకు ఎలాంటి చెడు అభిప్రాయమూ లేదు. ఆయన మంచి నటుడు .. అద్భుతంగా డాన్స్ చేస్తాడు. ఇద్దరం కలిసి ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేశాం.
అల్లు రామలింగయ్యగారి కూతురు సురేఖను ఆయన పెళ్లి చేసుకున్నారు. అల్లు రామలింగయ్య గారితో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఆయనతో కలిసి చాలా సినిమాల్లో నటించాను. ఆయన కూతురు సురేఖ నా సోదరిలాంటిది .. అంటే ఆమె మన ఇంటి అమ్మాయి. మన ఇంటి అమ్మాయినే చిరంజీవి పెళ్లి చేసుకున్నాడు. మన ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు గనుకనే ఆయన బాగున్నాడు" అంటూ తనదైన స్టైల్లో సమాధానమిచ్చారు.