Begin typing your search above and press return to search.

కలెక్షన్ కింగ్ సూచనలతో కూడిన చురకలు!

By:  Tupaki Desk   |   10 Jan 2017 4:39 AM GMT
కలెక్షన్ కింగ్ సూచనలతో కూడిన చురకలు!
X
మంచు విష్ణు అప్ కమింగ్ మూవీ "లక్కున్నోడు" ఆడియో వేడుక ఘనంగా జరిగింది. అయితే ఈ వేదికపై మాట్లాడుతున్న సమయంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు స్పీచ్ మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. ఎవరిని ఉద్దేశించి అన్నారు, ఏ సందర్భాలను గుర్తుచేస్తూ అన్నారు, ఆయనేసిన చురకలు ఎవరెవరికి తగిలాయి అనే విషయాలు కాసేపు పక్కనపెడితే... చెప్పిన విషయాలు మాత్రం చాలా మంచివి అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇంతకూ మోహన్ బాబు ఈ ఆడియో విడుదల వేదికపై ఏమన్నారో ఇప్పుడు చూద్దాం...

ట్విట్టర్ వేదికగా ఈ మధ్య కాలంలో సెలబ్రెటీలు - వారి వారి అభిమానుల మధ్య జరుగుతున్న రచ్చ సంగతి తెలిసిందే. శృతిమించిన ట్వీట్లతో ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్న సంఘటనలు ఒక్కోసారి జుగుప్సగా కూడా ఉంటున్నాయనే కామెంట్సూ వినిపిస్తున్నాయి. ఇదే విషయాలపై పరోక్షంగా స్పందించిన మోహన్ బాబు... ఇండస్ట్రీలో ఉన్నవారు ఎవరి పొలంలో వారు పంట పండించుకుంటారు, ఆ సమయంలో ఎవరికి వారు తమ పొలం బాగుండాలి అనుకోవడంలో తప్పులేదు కానీ పక్కోడి పొలంలో ఎలుకలు పడాలని కోరుకోవడం మంచిది కాదని, అలా కోరుకుంటే ముందుగా ఆ ఎలుకలు వారి పొలంలో పంటనే పాడుచేస్తాయని అన్నారు. పక్కవాడికంటే ఒక రూపాయి ఎక్కువ సంపాదించుకొవాలని కోరుకోవచ్చు కానీ, ఇతరులు నాశనం అయిపోవాలని కాదని కలెక్షన్ కింగ్ చెప్పాలనుకున్న విషయం ఈసారి ఇలా చెప్పారు.

ట్విట్టర్ లో ఒక హీరో గురించి మరొక హీరో అభిమానులు ఒకరిపై ఒకరు పిచ్చి పిచ్చి కామెంట్స్ చేసుకోవడంపై స్పందించిన మోహన్ బాబు... ఎంతో ప్రేమతో థియేటర్లకు వెళ్తారు, రోజంతా కష్టపడి సంపాదించిన సొమ్ముతో సినిమాలను ప్రోత్సహిస్తుంటారు, నటులను అభిమానిస్తుంటారు.. అలా తమ తమ హీరోలను ప్రేమించండి, గౌరవించడం మంచిదే కానీ ఒకరి పై ఒకరు బురద జల్లుకోవడం మంచిది కాదని పెద్దరికంగా సూచించారు!!



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/