Begin typing your search above and press return to search.

మోహన్ బాబుకి ఇదే మొదటి సారి

By:  Tupaki Desk   |   19 Jan 2016 5:30 PM GMT
మోహన్ బాబుకి ఇదే మొదటి సారి
X
మోహన్ బాబు వయసు ఇప్పుడు 65 సంవత్సరాలు. అందులోనూ సీనియర్ సినీ హీరో. కేరక్టర్ ఆర్టిస్ట్ నుంచి విలన్ వరకూ ఎన్నో పాత్రలను అవలీలగా చేసేసే సామర్ధ్యం ఉన్న వ్యక్తి. ప్రతిభ తెచ్చిన హోదా, దాని వెంటే వచ్చిన ఐశ్వర్యం.. ఇన్నీ కలిపితే గ్లామర్ ఫీల్డ్ లో ఉన్న వారంతా తెగ ఎంజాయ్ చేసేస్తారని అనుకుంటాం. కానీ మోహన్ బాబు ఇప్పటివరకూ గోవా కూడా చూడలేదంటే ఆశ్చర్యం వేస్తుంది.

అవును ఇప్పటివరకూ మోహన్ బాబు గోవాను చూడకపోయినా.. ఇప్పుడు మాత్రం గోవా ట్రిప్ లోనే ఉన్నారు. స్వయంగా ఆయన కూతురు మంచి లక్ష్మే ఈ ట్రిప్ కి తీసుకెళ్లింది. తండ్రి మోహన్ బాబు, తల్లి నిర్మలాదేవిలను గోవా టూర్ కి తీసుకెళ్లింది మంచు లక్ష్మి. వాళ్లు విమానం ఎక్కాక ఓ ఫోటో తీసి, దాన్ని పోస్ట్ చేసింది కూడా. 'గోవాకి వాళ్లిద్దరి మొదటి ప్రయాణం, తీసుకెళుతున్న నేను ఎంతో ఎగ్జయిట్ అవుతున్నా 'అంటూ ట్వీట్ చేసింది మంచు లక్ష్మి.

షూటింగ్ లో భాగంగా దేశ విదేశాలు తిరిగేస్తారు సినిమావాళ్లు. కానీ మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఆన్ ఎర్త్ అని గుర్తింపు పొందిన గోవాని కూడా మోహన్ బాబు చూడలేదంటే, ఆయన సింప్లిసిటీ అర్ధమవుతుంది. మరోవైపు సినిమాల సంగతి చూస్తే మోహన్ బాబు రీసెంట్ గా చేసిన మామ మంచు అల్లుడు అంచు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. విష్ణు చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకటి శారద అనే మూవీ కాగా, ఇంకొకటి రాజ్ తరుణ్ తో కలిసి మల్టీ స్టారర్ చేస్తున్నాడు. మంచు మనోజ్ అయితే శౌర్యని రిలీజ్ కి సిద్ధం చేశాడు. మంచు లక్ష్మి ప్రస్తుతం ఏ ప్రాజెక్టును అంగీకరించలేదు.