Begin typing your search above and press return to search.
యాపిల్ బ్యూటితో మోహన్ బాబు జోక్స్
By: Tupaki Desk | 28 Jan 2017 10:34 AM ISTలక్కున్నోడు అంటూ రీసెంట్ గా మంచు విష్ణు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టాక్ అటూఇటూగా ఉన్నా.. మూవీకి కలెక్షన్స్ బాగానే ఉన్నాయని ఇండస్ట్రీ జనాలు చెబుతున్నారు. ఈ సందర్భంగా లక్కున్నోడు టీంకి శుభాకాంక్షలు చెబుతూ.. ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు మోహన్ బాబు.
పాండవులు పాండవులు తుమ్మెద.. అంతకు ముందు దేనికైనా రెడీ చిత్రాల్లో కలిసి నటించారు మంచు విష్ణు- హన్సికలు. ఇప్పుడిది వీరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా అంటూ.. బెస్టాఫ్ లక్ చెప్పిన మోహన్ బాబు.. ఇద్దరికీ షేక్ హ్యాండ్ ఇచ్చారు. అయితే.. హన్సిక చేతిని వదలకుండానే కాసేపు మాట్లాడిన ఆయన.. 'ఓహ్.. చెయ్యి పట్టుకున్నాననా.. తను ఉన్నాడనా? ఏరా విష్ణు ఉన్నాడని చెయ్యి తాకకూడదా' అంటూ విష్ణు వైపు చూసిన మోహన్ బాబు.. 'చెయ్యి తాకచ్చు' అంటూ ఆట పట్టించారు.
సాధారణంగా హీరోయిన్ల విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండే మోహన్ బాబు.. ఇలా హన్సికను ఆట పట్టించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే.. వరుసగా మూడు సినిమాలు చేసి.. మా ఫ్యామిలీ మెంబర్ వి అయిపోయావ్ అంటూ నవ్వేసిన మోహన్ బాబు.. లక్కున్నోడు టీంకి కంగ్రాట్స్ చెప్పారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/