Begin typing your search above and press return to search.
వారసత్వం, కులాలపై మోహన్ బాబు హాట్ కామెంట్స్
By: Tupaki Desk | 13 April 2020 7:00 AM GMTఏదైనా ఉన్నది ఉన్నట్టు.. ముఖం మీదే చెప్పే విలక్షణ నటుడు మోహన్ బాబు.. ఈయన ముక్కుసూటి తనం.. తీవ్రమైన క్రమశిక్షణ కారణంగా పలు వివాదాలు రాజుకున్నాయి. అయితే పంథా మార్చుకోని కలెక్షన్ కింగ్ ఎప్పుడూ హాట్ కామెంట్స్ చేస్తూనే ఉంటాడు. తాజాగా ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశాడు.
తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు కులాలుగా విడిపోయాయి. రాజ్యాధికారం సహా పెత్తనం అంతా ఆ రెండు మూడు కులాల చేతిలోనే ఉంటోంది. ఈ నేపథ్యంలోనే కులాలపై మోహన్ బాబు చేసిన కామెంట్స్ ఆసక్తి రేపాయి.
మోహన్ బాబు మాట్లాడుతూ.. ‘సమాజంలో ఇప్పుడు రెండే కులాలున్నాయి. ఒకటి పాజిటివ్, రెండోది నెగెటివ్. పదవీ అహంకారంతో ఉండే ఎవరైనా దీన్ని అర్థం చేసుకోవాలి.. అప్పుడు జీవితాంతం గొప్పగా ఉంటుంది. అందుకే ఇప్పుడు కరోనా వచ్చింది.మనకు గుణపాఠం నేర్పింది’ అంటూ హితబోధ చేశారు.
బాంబు వేస్తే ఏదో ఒకరోజు చచ్చిపోతాం.. కానీ ఎప్పుడు ఎలా వస్తుందో తెలియని కరోనా మహమ్మారితో ఎవరు చస్తారో తెలియని పరిస్థితి ఉందని మోహన్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు. అందరినీ విడగొట్టే సత్తా కరోనాకు ఉందని.. ఇప్పటికైనా జనాలు మారాలని మోహన్ బాబు హెచ్చరించాడు.
అసలు వారసత్వం అనే పదమే లేదని మోహన్ బాబు స్పష్టం చేశారు. ఎవడికి కావాలి వారసత్వం అంటూ సంచలన కామెంట్ చేశాడు. విష్ణు, మనోజ్, లక్ష్మీలు తన పిల్లలుగా ఉండాలని రాసి పెట్టి ఉందని.. వారసత్వం పనిచేయదని కుండబద్దలు కొట్టారు. మనోజ్ కు నటన అంటే ఇష్టమని.. విష్ణుకు బిజినెస్ అంటే మక్కువ అని.. లక్ష్మీ కూడా నటనలోనే కొనసాగాలని చూస్తోందన్నాడు. ఎవడెక్కడ సక్సెస్ కావాలని రాసుంటే అక్కడికి వస్తాడని స్ఫష్టం చేశాడు.