Begin typing your search above and press return to search.

మోహన్ బాబు అన్ని విషయాలు అలీ చెప్పించేనా?

By:  Tupaki Desk   |   23 Sep 2021 2:30 AM GMT
మోహన్ బాబు అన్ని విషయాలు అలీ చెప్పించేనా?
X
లుగు బుల్లి తెరపై ఇప్పటి వరకు ఎన్నో టాక్ షో లను మనం చూశాం. అయితే కొన్ని కొంత కాలం వరకు వచ్చి కనిపించకుండా కనుమరుగయ్యాయి. కాని అలీతో సరదాగా మాత్రం సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తోంది. ప్రతి వారం కూడా అలీ కొత్త కొత్త గెస్ట్‌ లను సీనియర్ లను తీసుకు వచ్చి ప్రేక్షకులకు వారి గురించి మరింతగా తెలిసేలా చేస్తున్నాడు. బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్‌ హిట్స్ దక్కించుకున్న హీరోలు హీరోయిన్స్ మొదలుకుని కొన్ని సినిమాలతోనే కనుకమరుగు అయిన నటీ నటుల వరకు ఎంతో మందిని టెక్నీషియన్స్ గురించి ప్రేక్షకులకు చెప్పిన అలీ 250 వ ఎపిసోడ్ కు వచ్చింది. ల్యాండ్‌ మార్క్ ఎపిసోడ్‌ అవ్వడం వల్ల ఈ ప్రత్యేక ఎపిసోడ్‌ కు ప్రత్యేక గెస్ట్‌ గా మోహన్ బాబును ఆహ్వానించడం జరిగింది. ఇటీవలే మంచు వారి అబ్బాయి విష్ణు ను తీసుకు వచ్చి ఆయన్ను ఇంటర్వ్యూ చేసిన అలీ తాజాగా 250 ఎపిసోడ్‌ కోసం మోహన్ బాబును తీసుకు వచ్చాడు. సహజంగా అయితే మోహన్‌ బాబుతో ఇంటర్వ్యూ అంటే అంతా కూడా కాస్త భయపడుతూ ఉంటారు.

ఎంతో మంది స్టార్స్ ను ఇంటర్వ్యూ చేసిన వారు కూడా మోహన్ బాబును ఇంటర్వ్యూ చేయడం అంటే కాస్త వెనుక ముందు ఆడుతారు. ఎందుకంటే ఆయన్ను ఏ ప్రశ్నలు అడిగితే ఎలా రియాక్ట్‌ అవుతారో అర్థం కాదు. అందుకే ఆయన్ను కాస్త సున్నితమైన ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది. అది కాకుండా ఆయన వేసే ఎదురు ప్రశ్నలకు కాస్త జాగ్రత్తగా సమాధానాలు చెప్పకుంటే ఏమైనా అనే అవకాశాలు ఉంటాయి. అందుకే ఆయన్ను ఇంటర్వ్యూ చేయడం కంటే ఊరికే ఉన్నది ఉత్తమం అనుకునే వారు చాలా మంది ఉంటారు. అందుకే ఆయన ఇంటర్వ్యూలు చాలా చాలా తక్కువగా ఉంటాయి. ఆయన్ను అన్న అని పిలిచే అలీ ఇంటర్వ్యూ కోసం పిలిచాడు. అలీ ఇంటర్వ్యూలు అంటే కాస్త పర్సనల్ విషయాలను కూడా అడిగే సందర్బాలు చాలా ఉంటాయి. అలా చాలా మంది సెలబ్రెటీలకు సంబంధించిన తెలియని విషయాలను అలీ మనకు తెలియజేశాడు. కాని మోహన్ బాబు నుండి అలాంటిది ఏ ఒక్క తెలియని విషయమైనా అలీ రాబట్టగలడా అంటూ కొందరు ఆసక్తిగా చూస్తున్నారు.

అలీతో సరదాగా 250 ఎపిసోడ్‌ కు సంబంధించిన ప్రోమోను తాజాగా యూట్యూబ్ ద్వారా విడుదల చేశారు. మోహన్ బాబు కు స్టూడియోలకు భారీగా వెల్‌ కమ్‌ చెప్పడంతో పాటు చాలా స్పెషల్ ట్రీట్‌మెంట్‌ ఇవ్వడం జరిగింది. ఇక ఎపిసోడ్‌ కు సంబంధించిన ప్రోమోలో అయితే ఎలాంటి వివాదాస్పద ప్రశ్నలు అడగలేదు. మోహన్‌ బాబుతో ఏదైనా ప్రత్యేక విషయం.. ఎవరికి తెలియని విషయాలను అలీ అడిగి ఉంటాడా అనేది చూడాలి. మోహన్ బాబు చాలా విషయాలను ఈ టాక్ షో లో చెప్పి ఉంటాడు.. కాని కొన్ని ఆసక్తికర విషయాలు.. ఆయన కొడుకులు మరియు కూతురు గురించిన విషయాలను మోహన్ బాబు చెప్పాడా అనేది చూడాలి. ఈ ఎపిసోడ్‌ ఖచ్చితంగా అత్యధికులు చూసే అవకాశాలు ఉన్నాయి.