Begin typing your search above and press return to search.
ఆ సినిమా ఫ్లాప్ అయితే రోడ్డునపడేవాళ్లం: మోహన్ బాబు
By: Tupaki Desk | 13 Feb 2022 3:05 AM GMTమోహన్ బాబు చాలా గ్యాప్ తరువాత కథానాయకుడిగా ఒక సినిమా చేశారు. మోహన్ బాబు నటనలో ఉక్రోషం .. ఉద్వేగం .. ఆవేశం .. ఆత్మవిశ్వాసం ప్రధానంగా కనిపిస్తాయి. ఆ అంశాలను కలుపుతూనే ఆయన కథలు ఉంటాయి. అలా ఆయన చేసిన మరో సినిమానే 'సన్ ఆఫ్ ఇండియా'. మోహన్ బాబు ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, ఆయన సొంత బ్యానర్లో నిర్మితమైంది. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించారు. ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను ఈ నెల 18వ తేదీన విడుదల చేయనున్నారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ వేదికపై మోహన్ బాబు మాట్లాడుతూ .. "సినిమా నా ఊపిరి అన్నారు మా గురువుగారు. అలాగే మా కుటుంబానికి సినిమా ఊపిరి. ఏమీ లేకుండా పొట్ట చేత బట్టుకుని వచ్చాము .. నటుడిగా సంపాదించాము .. నిర్మాతగా సంపాదించాము. సంపాదించినది ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ కి పెట్టాము. కులమతాలకు అతీతంగా 25 శాతం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. ఎంతో కష్టపడుతూ .. అంచలంచెలుగా ఎదుగుతూ ఈ రోజున అది ఒక యూనివర్సిటీ అయింది.
ఇక సినిమా విషయానికి వస్తే .. ప్రతి సినిమాలోను రిస్క్ ఉంటుంది. లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ ను నేను స్థాపించినప్పుడు, 'బొబ్బిలి పులి' గెటప్ లో అన్నగారు వచ్చి కొబ్బరికాయ కొట్టారు. మా అక్కయ్య దాసరి పద్మగారు జ్యోతిని వెలిగించింది. అప్పటికి ముగ్గురు పిల్లలు చిన్నవాళ్లు. నిర్మాతగా నన్ను ప్రోత్సహించినవారెవరూ లేరు .. నాకు నేనుగా అనుకున్నాను. ఎమ్.డి. సుందర్ అప్పట్లో బిజీ రైటర్. ఆయన 50 కథలు చెప్పినా నాకు నచ్చలేదు. అప్పుడు కన్నడలో రాజ్ కుమార్ గారు చేసిన ఒక సినిమా కథ నాకు చెప్పారు.
ఆ కథను చేస్తానని చెప్పాను .. అది కన్నడలో ఫ్లాప్ అయిందని ఆయన అన్నాడు. అయినా అదే సినిమాను చేస్తానని చెప్పాను. అప్పటికి ఖాళీగా ఉన్న ఒక డైరెక్టర్ ను పిలిపించాను. రిస్క్ .. ఆ సినిమా ఫ్లాప్ అయితే ఇల్లు అమ్మేసి రోడ్డు మీద పడిపోవలసిందే. అయినా రిస్క్ చేసి ఆ సినిమాను ఒక పెద్ద సినిమాకి పోటీగా వేశాను. నా సినిమా హిట్ .. ఆ సినిమా ఫ్లాప్. రిస్క్ చేశాను .. అది నన్ను నిలబెట్టింది. ఎవరికి తోచిన సలహాలు వాళ్లు ఇస్తూనే ఉంటారు. ఏది చేస్తే బావుంటుందో చూసుకుని రిస్క్ చేయవలసిందే.
ఒక రోజున రత్నబాబు వచ్చి .. నాకు 'సన్ ఆఫ్ ఇండియా' కథ చెప్పాడు. వెంటనే ఈ సినిమా చేద్దామని అన్నాను. విష్ణు అభిప్రాయం కోసం అడిగితే వెంటనే టైటిల్ లోగో వేసి పంపించాడు. నా ఆలోచన కరెక్టుగా ఉంటుందని అనుకున్నాడు. విష్ణు నో అంటే ఈ సినిమాను తీసుండేవాడిని కాదు. భారతదేశ చలనచిత్ర చరిత్రలో ఇలాంటి సినిమా ఒకప్పుడు సునీల్ దత్ చేశారు .. మళ్లీ ఇప్పుడు నేను చేశాను. ఈ కథలో పవర్ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి ... రాజకీయాలు ఉన్నాయి .. ఫ్యామిలీ ఉంటుంది. ఈ సినిమాలో ఇళయరాజా స్వరపరిచిన ఒక పాట కోసం కోటి ఎనభై లక్షలు ఖర్చు చేశాము.
ఇది గ్యాసా? డబ్బా కొట్టుకుంటున్నాడా? అనుకోవద్దు. ఆ పాట చూస్తే నేను చెప్పింది నిజమా కదా అనేది మీకే తెలుస్తుంది. మోహన్ బాబు గ్యాస్ కొట్టడు .. డబ్బా కొట్టుకోడు. ఈ సినిమాలో నా డైలాగులు చాలా బాగుంటాయి .. అందులో నిజాలు ఉంటాయి. నేటి రాజకీయాలను గురించి చెప్పాను .. అవినీతి చీడపుగులను ఏరివేయాలని చెప్పాను. ఈ సినిమా చేయడం రిస్క్ .. వస్తే వస్తుంది .. ఫెయిలైతే ఫెయిలవుతుంది. ఫెయిలైనంత మాత్రం అసమర్థులం కాదు. ఒక్క మాట మాత్రం చెప్పగలను .. చాలా కాలం తరువాత వచ్చిన ఒక గొప్ప సినిమా ఇది" అంటూ చెప్పుకొచ్చారు.