Begin typing your search above and press return to search.
మోహన్ బాబు-రజినీకాంత్.. ఎన్నాళ్లకెన్నాళ్లకో
By: Tupaki Desk | 4 Sep 2016 6:22 AM GMTసూపర్ స్టార్ రజినీకాంత్ కు.. విలక్షణ నటుడు మోహన్ బాబుకు ఉన్న అనుబంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వాళ్లిద్దరిదీ దశాబ్దాల స్నేహ బంధం. ఇద్దరూ కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. మోహన్ బాబు కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ ‘రాయలసీమ రామన్న చౌదరి’కి కథ అందించింది రజినీకాంతే. ఒకప్పుడు చాలా సన్నిహితంగా మెలిగిన రజినీ.. మోహన్ బాబు గత కొంత కాలంగా కలవడం తగ్గిపోయింది. ఐతే చాన్నాళ్ల తర్వాత మోహన్ బాబే స్వయంగా రజినీని కలవడానికి చెన్నై వెళ్లారు. సూపర్ స్టార్ ఇంట్లో సందడి చేశారు.
తన చిరకాల మిత్రుడిని ఆప్యాయంగా కౌగిలించుకుని ఫొటో దిగిన మోహన్ బాబు.. రజినీ భార్య లతతో రాఖీ కట్టించుకున్నారు. ఈ రెండు ఫొటోల్ని ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ సందర్భంగా రజినీని దుర్యోధనుడిగా.. తనను కర్ణుడిగా మోహన్ బాబు అభివర్ణించడం విశేషం. ‘‘నా బెస్ట్ ఫ్రెండ్ ను కలిసి చాలా సమయం గడిపాను. అతను రాజులా కనిపించాడు. ఈ కలియుగంలో రజినీ దుర్యోధనుడైతే.. నేను కర్ణుడిని’’ అని మోహన్ బాబు అన్నారు. రజినీ సతీమణి గురించి స్పందిస్తూ.. ‘‘చాన్నాళ్ల తర్వాత నా గొప్ప చెల్లెల్ని కలిశాను. ఆమె లేకుంటే రజినీ ప్రస్తుతమున్న స్థితిలో ఉండేవాడు కాదన్నది నా బలమైన నమ్మకం’’ అని మోహన్ బాబు చెప్పారు.