Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ తో సెటిలైంది.. ఏఎన్నార్ తో కాలేదు
By: Tupaki Desk | 5 Jun 2017 7:42 AM GMTదర్శకుడిగా తెలుగులో ఎవ్వరూ అందుకోని స్థాయిని అందుకున్నాడు దాసరి నారాయణరావు. తెలుగులో మహానటులు ఎన్టీఆర్.. ఏఎన్నార్ లతో ఆయన మెగా హిట్లు ఇచ్చారు. ఆ ఇద్దరికీ అత్యంత ఆప్తుడిగా మారారు. కానీ వాళ్లిద్దరితోనూ ఆయనకు విభేదాలు తలెత్తాయి. ఇద్దరితోనూ దూరం పెరిగింది. ఐతే ఎన్టీఆర్ తో ఆయనకు మళ్లీ స్నేహం కుదిరింది కానీ.. ఏఎన్నార్ తో మాత్రం దూరం అలాగే కొనసాగింది. ఇంతకీ ఎన్టీఆర్.. ఏఎన్నార్ లతో దాసరికి ఎక్కడ తేడా వచ్చింది. ఎన్టీఆర్ కు మళ్లీ ఆయన ఎలా చేరువయ్యారు? ఏఎన్నార్ తో మాత్రం మళ్లీ ఎందుకు కలవలేకపోయారు. దాసరి ప్రియ శిష్యుడు మోహన్ బాబు మాటల్లో ఆ సంగతులు తెలుసుకుందాం పదండి.
‘‘అన్నగారికి.. మా గురువు గారికి కొన్ని నెలల పాటు మాటలు లేవు. నిజానికి రామారావు గారికి దాసరి గారంటే విపరీతమైన ప్రేమ.. గౌరవం.. అభిమానం. ఎన్నో సందర్భాల్లో ‘మీ గురువుగారు గొప్ప మేధావి’ అనేవారు. ఐతే అన్నగారు ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమా తీస్తున్నప్పుడే మా గురువు గారు దానికి పోటీగా ‘విశ్వామిత్ర’ సీరియల్ తీశారని అన్నగారికి కోపమొచ్చింది. దీంతో ఇద్దరికి మాటలు లేకుండా పోయాయి. ఐతే నేనోసారి అన్నగారితో కూర్చున్నపుడు మా గురువుగారి విషయం ప్రస్తావించాను. వెంటనే ‘ఫోన్ కలపండి’ అని అన్నగారు గంభీరంగా అన్నారు. ఫోన్ చేసి గురువుగారు తీయగానే అన్నగారికి ఇచ్చాను. వాళ్లిద్దరూ మాట్లాడుకుంటుంటే నేను పక్కకు వచ్చేశాను.
ఫోన్లో ఆయనేం చెప్పారో ఏమో.. 20 నిమిషాల తర్వాత మా గురువుగారు అన్న గారింటికి వచ్చేశారు. అన్ని విషయాలూ మరిచిపోయి రెండు గంటల పాటు ఇద్దరూ రకరకాల విషయాలపై మాట్లాడుకున్నారు. అలాగే ఏఎన్నార్ గారితోనూ మా గురువుగారికి మంచి అనుబంధం ఉండేది. వాళ్లిద్దరి కాంబినేషన్లో అద్భుతమైన సినిమాలొచ్చాయి. కానీ ఒక విషయంలో మనస్ఫర్థలు వచ్చి ఇద్దరికీ మాటల్లేకుండా పోయాయి. అన్నగారితో గురువుగారిని కలిపినట్లే.. ఏఎన్నార్ గారితోనూ ఆయన్ని కలపాలని చూశాను. కానీ కుదరలేదు. ఇద్దరి మధ్య విభేదాలకు కారణం ఎవరో నాకు తెలుసు. కానీ వాళ్లిద్దరూ ఇప్పుడు లేరు కాబట్టి ఇప్పుడు ఆ సంగతి చెప్పను. ఐతే ఓ చిన్న అమౌంట్ విషయంలో తేడా వచ్చిందన్నది మాత్రం వాస్తవం’’ అని మోహన్ బాబు చెప్పారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/