Begin typing your search above and press return to search.

మనవరాలికి రైమ్స్ నేర్పిస్తున్నాడు

By:  Tupaki Desk   |   23 Nov 2015 7:30 PM GMT
మనవరాలికి రైమ్స్ నేర్పిస్తున్నాడు
X
ఆయన కలెక్షన్ కింగ్, మరోవైపు డైలాగ్ కింగ్.. ఆయనే మంచు మోహన్ బాబు. మరి ఆయన ఇంట్లో ఎలా ఉంటారు ? అమ్మో నాన్న బాగా స్ట్రిక్ట్. ఆయన దగ్గర ఏ కొంచెం తేడా వచ్చినా.. ఇక అంతే.. ఇదీ ఆయన కొడుకులు విష్ణు - మనోజ్ లు - కూతురు లక్ష్మీ ప్రసన్న చెప్పే మాటలు. మరి ఆయన అందరితోనూ అంతే స్ట్రిక్ట్ గా ఉంటారా ?

ఎవరి దగ్గరైనా కుదురుతుందేమో కానీ.. మనుమలు - మనవరాళ్ల దగ్గర మాత్రం ఇలాంటివేం చెల్లవు. వాళ్ల దగ్గరికి వచ్చేసరికి ఎంతటి వాళ్లైనా పిల్లలుగా మారిపోవాల్సిందే. వారితో కలిసి ఆడిపాడాల్సిందే. వాళ్లు అడిగినవన్నీ తెచ్చివ్వాల్సిందే. ఇదుగో ఇప్పుడు మోహన్ బాబు కూడా లక్ష్మీ ప్రసన్న కూతురు - తన మనవరాలు నిర్వాణతో అలాగే ఆడుతున్నారు. పనిలో పనిగా ఆ చిన్నారికి చందమామ రావే పాడుతూ.. చందమామని చూపిస్తున్నారు.

విలక్షణ నటుడు మోహన్ బాబు ఫిలిం ఇండస్ట్రీలోకి ప్రవేశించి 40 ఏళ్లు అయిన సందర్భంగా.. పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ బాగా బిజీగా ఉన్నారిపుడు. అయినంత మాత్రాన కుటుంబంతో గడపడంలో మాత్రం ఆయన తన సంతోషాన్ని ఎప్పుడూ పంచుకుంటూనే ఉంటారు. అయినా మనవరాలితో సంతోషంగా గడపడం కంటే ఎక్కువ ఆనందం ఇచ్చే సందర్భం ఏముంటుంది చెప్పండి.