Begin typing your search above and press return to search.
మంచు లక్ష్మి పాట గురించి మోహన్‌బాబు
By: Tupaki Desk | 12 April 2015 3:30 PM GMTయాందిరో మీ మగాళ్ల గోల.. అంటూ మంచు లక్ష్మి పాడిన పాట యూట్యూబ్‌లో ఓ ఊపు ఊపేస్తోంది దొంగాట సినిమా కోసం ఆమె పాడిన ఈ పాట గురించి సోషల్ మీడియాలో ప్రముఖులందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఈ పాట గురించి మోహన్‌బాబు స్పందనేంటి? తన కూతురి పాట ఆయనకు నచ్చిందా? దీని గురించి ఆయన మాటల్లోనే విందాం పదండి.
''మా లక్ష్మి మంచి గాయని కావాలని కోరుకున్నాను. ఒకప్పుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, జేసుదాసు లాంటి గాయకులకు ఈ విషయం చెప్పాను. కానీ పాటలెందుకు, చక్కగా చదువుకోమన్నారు. మద్రాసులో ఓ సంగీత విధ్వాంసుడి దగ్గర చేర్పిస్తే.. పాటలు వదిలేసి వంటలు నేర్చుకుంది. మొత్తం మీద నేను కోరుకున్నట్లు సింగర్ కాలేదు. ఇప్పుడు దొంగాట సినిమాలో ఆమె పాట పాడిందంటే నమ్మలేకపోయాను. చాలా బాగా పాడింది. ఒకప్పుడు ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలూగించిన ఎల్.ఆర్.ఈశ్వరి గారి గొంతును గుర్తు చేసింది. ఈ పాటకు వస్తున్న స్పందన చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది'' అన్నారు మోహన్‌బాబు. తాను సింగర్ కావాలని తన తండ్రి ఎంతో తపన పడ్డారని.. తాను పాడిన పాట ఆయన్ని గర్వపడేలా చేసిందని అనుకుంటున్నానని మంచు లక్ష్మి చెప్పింది.