Begin typing your search above and press return to search.
బొకే బాకీ తీర్చేసిన బాబు
By: Tupaki Desk | 29 Nov 2017 4:37 AM GMTరీసెంట్ గా మోహన్ బాబు కెరీర్ లో 42 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. ఆయనను బోలెడంత మంది అభినందించారు. మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న కూడా ఓ బొకే ఇచ్చి మరీ తండ్రికి కంగ్రాచ్యులేషన్స్ చెప్పిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు మోహన్ బాబు కూడా తన కూతురికి ఓ బొకే ఇచ్చి అభినిందించి ఆమెను ఆశీర్వదించారు. అయితే.. ఈయన కాన్సెప్ట్ వేరు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ వాణిజ్య వేత్తల సదస్సుకు అమెరికా అధ్యక్షుని కుమార్తె ఇవాంకా ట్రంప్ హాజరు కాగా.. ప్రధాని మోడీతో పాటు అనేక మంది కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో 58శాతం మహిళా పారిశ్రామిక వేత్తలు హాజరు కాగా.. మంచు లక్ష్మీ ప్రసన్న కూడా ఓ ప్యానల్ డిస్కషన్ లో పాల్గొనాల్సి ఉంది. మహిళా పారిశ్రామికవేత్తలకు ఎదురయ్యే సమస్యలు.. ఔత్సాహిక ఉమెన్ ఆంట్రప్రెన్యూర్స్.. వారి లైఫ్ లో ఎదురయ్యే వివక్ష వంటి అంశాలపై మంచు లక్ష్మి ప్రసంగం సాగనుంది.
జీఈఎస్ సదస్సులో ప్రసంగించే అవకాశం అందుకున్న తన కుమార్తెను అభినందించిన మోహన్ బాబు.. 'ఎన్ జెండర్డ్ డైలాగ్ ప్యానల్ లో నా కుమార్తె మంచు లక్ష్మి ఉండడం నాకెంతో గర్వకారణం' అంటూ చెప్పిన మోహన్ బాబు.. భగవంతుడి ఆశీస్సులతో ఆమెకు మరింత శక్తి అందాలని కోరుకుంటున్నానని చెప్పారు. అంతే కాదు.. తన కూతురు ఇచ్చిన బొకే కంటే పేద్ద బొకేను ఆమెకు ఇచ్చి ప్రశంసించి.. బొకే బాకీ కూడా తీర్చేశారు.